Mahesh Babu Heroine: ఇండస్ట్రీ కి చెందిన హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా చాలామంది వయసు మీద పడినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రేజీ హీరోయిన్ కూడా ఒకరు. తెలుగులో ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో అలాగే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో అడుగు పెట్టాలని, స్టార్ డం సంపాదించుకోవాలని చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు చాలామంది సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నారు. ఆ సినిమాలో ఉన్న పాత్ర డిమాండ్ చేసినట్లయితే నటించడానికి కొంతమంది ముద్దుగుమ్మలు సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన కూడా కొన్ని పాత్రలు చేయము అంటూ చెప్పేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం ఎన్ని కోట్లు ఇచ్చిన సరే కొన్ని పాత్రలు చేయము అంటూ చెబుతున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు 100 కోట్లు పారితోషకం ఇచ్చినా కూడా ఆ పని చేయను అంటూ చెప్పేసింది ఈ హీరోయిన్.
Also Read: 50 శాతం టార్గెట్ ని అందుకున్న ‘రెట్రో’..6 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!
కొంతమంది ముద్దుగుమ్మలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలతోనే బాగా ఫేమస్ అయ్యారు. వాళ్లు తెలుగులో కేవలం ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి హీరోయిన్లలో అమీషా పటేల్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో హీరో మహేష్ బాబుతో, పవన్ కళ్యాణ్ తో, ఎన్టీఆర్ తో కలిసి జంటగా నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేసే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం హీరోయిన్ అమీషా పటేల్ వయసు 49 ఏళ్లు. ఇప్పటికీ కూడా అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో ఈమె కొంచెం సినిమాల స్పీడ్ తగ్గించింది.
సన్నీడియోల్ హీరోగా నటించిన గద్దర్ 2 సినిమాతో అమిషా పటేల్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఈ వయసులో కూడా తన అంద చందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటుంది. అయితే గతంలో అమీషా పటేల్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఈమె ఒక సందర్భంలో ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా ఓ పాత్ర చేయను అని చెప్పింది. అమీషా పటేల్ అత్త పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు అని కొన్ని కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. దానికి క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్ ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర చేయకూడదు అనే ఫుల్ క్లారిటీ నాకు ఉంది. నాకు మీరంటే చాలా గౌరవం ఉంది, వందల కోట్లు ఇచ్చినా కూడా నేను అత్త పాత్రలు చేయను అంటూ తెలిపింది.