Mahesh Babu : మహేష్ బాబు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. యాభై ఏళ్ళు దగ్గరైనా కాలేజ్ స్టూడెంట్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ ఆయనకు సెట్ అవుతాయి. బై బర్త్ వచ్చిన గ్లామర్ తో పాటు క్రమశిక్షణతో కూడిన జీవితం ఇందుకు కారణం. మహేష్ బాబు డైలీ వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. నిద్ర, తిండి విషయంలో సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన టైమింగ్స్ ఫాలో అవుతారు. ఇంత నిబద్ధతగా ఉన్నా పలు కారణాలతో స్టార్స్ అనారోగ్యం బారినపడుతుంటారు.
ఒక దశలో మహేష్ విపరీతమైన మైగ్రేన్ తో బాధపడ్డారట. తలనొప్పి సమస్య ఏళ్ల తరబడి వేధించిందట. ఎంత మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదట. అసలు మైగ్రేన్ కి శాశ్వత పరిష్కారం లేదని చెప్పారట. ఇంగ్లీష్ మెడిసిన్ ఇన్స్టెంట్ గా నొప్పిని తొలగించగలుగుతుంది కానీ సమస్యను దూరం చేయడం లేదట. పెయిన్ వచ్చినప్పుడల్లా మహేష్ టాబ్లెట్స్ మింగేవారట. అప్పటికి ఉపశమనం కలిగేదట. అప్పుడు నమ్రత ఒక లేడీ డాక్టర్ ని పరిచయం చేశారట.
ఆమె మహేష్ కి అల్లోపతి చేశారట. బాడీలోని నరాలను రిలీజ్ చేయడం ద్వారా మైగ్రేన్ ని తొలగించారట. కేవలం రెండు మూడు నెలల్లో మిరాకిల్ గా ఆయనకు తలనొప్పి సమస్య పోయిందట. ఈ విషయాన్ని మహేష్ ఒక సందర్భంగా లో స్వయంగా చెప్పారు. మైగ్రేన్ వలె మహేష్ కి మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయనే పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు మోకాలి సర్జరీ జరిగిందంటారు.
ఆ మధ్య విదేశాల్లో ఒక వైద్యుడిని కలిశాడు. అప్పట్లో అదే న్యూస్ అయ్యింది. ప్రత్యేకమైన వైద్యం కోసం ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడిని కలిశారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు మరలా అమెరికా వెళ్లినట్లు సమాచారం. మహేష్ లేకపోవడంతో గుంటూరు కారం షూటింగ్ ఇతర నటులతో కొనసాగిస్తున్నారు. మహేష్ ఆకస్మిక ప్రయాణం వైద్యం కోసమే అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది నుండి మహేష్ రాజమౌళి చిత్ర షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది.