https://oktelugu.com/

నేనేమో బాధ‌లో ఉంటే.. మ‌హేష్‌ అలా అన్నాడుః రావిపూడి

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మందిని క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టేసింది. వీరిలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. దాదాపు నెల క్రిత‌మే ఆయ‌న్ను కొవిడ్ అటాక్ చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు.. త‌న సినిమా ప‌నుల‌ను సైతం చూసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌ను కొవిడ్ కాలంలో ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. త‌నతోపాటు భార్య కూడా ఐసోలేష‌న్లో ఉంద‌ని చెప్పిన అనిల్‌.. పిల్ల‌ల‌ను మాత్రం బంధువులు చూసుకున్నార‌ని తెలిపారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2021 / 04:04 PM IST
    Follow us on

    తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మందిని క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టేసింది. వీరిలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. దాదాపు నెల క్రిత‌మే ఆయ‌న్ను కొవిడ్ అటాక్ చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు.. త‌న సినిమా ప‌నుల‌ను సైతం చూసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌ను కొవిడ్ కాలంలో ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు.

    త‌నతోపాటు భార్య కూడా ఐసోలేష‌న్లో ఉంద‌ని చెప్పిన అనిల్‌.. పిల్ల‌ల‌ను మాత్రం బంధువులు చూసుకున్నార‌ని తెలిపారు. అయితే.. ఫిజిక‌ల్ గా అనుభ‌వించిన క‌రోనా ఇబ్బందుల క‌న్నా.. పిల్ల‌ల‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చినందుకే మెంట‌ల్ గా ఇబ్బంది ప‌డ్డ‌ట్టు చెప్పారు. ఆ స‌మ‌యంలో చుట్టాలు చాలా జాగ్ర‌త్త‌గా చూసుకున్నార‌ని చెప్పారు.

    త‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలుసుకొని హీరో మ‌హేష్ బాబు ఫోన్ చేశార‌ని చెప్పారు. అయితే.. తాను క‌రోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వాటిని దూరం చేసేందుకు మ‌హేష్ చాలా ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. ఆయ‌న మాట‌ల్లో అది పెద్ద విష‌య‌మే కాద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు అనిల్‌. ఎక్క‌డికి వెళ్లారు? క‌రోనా ఎక్క‌డ త‌గిలించుకొని వ‌చ్చారు? అని కామెడీగా మాట్లాడేవార‌ని గుర్తు చేసుకున్నారు.

    క‌నీసం మూడునాలుగు రోజుల‌కు ఒక‌సారి గుర్తు పెట్టుకొని మ‌రీ ఫోన్ చేశార‌ని, ప్ర‌తీసారి కొవిడ్ ఆలోచ‌న లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కూడా ఫోన్ చేశార‌ని చెప్పారు. త‌న‌కు కొవిడ్ వ‌చ్చిన స‌మయానికే వ‌రుణ్ కు త‌గ్గిపోయింద‌ని, దీంతో.. ఇద్ద‌రమూ మాట్లాడుకొని, కండీష‌న్స్ షేర్ చేసుకునేవాళ్ల‌మ‌ని తెలిపారు.