Mahesh Babu Adventure Stunt: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లను వాడకుండా కొన్ని అడ్వెంచర్ సన్నివేశాలనైతే చేస్తుంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో డూప్ లేకుండా రియాలెస్టిక్ సన్నివేశాలను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘వన్ నేనొక్కడినే ‘ సినిమాలో ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్ మీదకి జంప్ చేసే సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా తను ఒక్కడే స్వయంగా చేశాడు. అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక అలాంటివే కాకుండా హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా కోసం ఆయన హార్స్ రైడింగ్ తో పాటు హార్స్ మీద నుంచి జంప్ చేసే సన్నివేశాన్ని కూడా తనే రియల్ గా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సన్నివేశంలో మహేష్ బాబు నిజంగా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తాడంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. డూప్ లేకుండా మహేష్ బాబు ఒరిజినల్ గా చాలా అద్భుతంగా స్టంట్ చేశాడంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని ప్రశంసలైతే దక్కుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుడిని పెద్దగా అలరించడం లేదు.
కాబట్టి వారణాసి మూవీతో ఏకంగా పాన్ వరల్డ్ లోకి తను ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఆయన ప్రపంచస్థాయి సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మొత్తానికైతే వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. కాబట్టి ఈ సినిమాతో రాజమౌళి పెను సంచలనాలను క్రియేట్ చేస్తాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది…
