Ravi Teja Krishna Vamsi Controversy: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చిన్న చితక పాత్రలు చేశాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇక ఒకానొక సందర్భంలో రవితేజతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపించారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే రవితేజ ఇండస్ట్రీకి రావడానికి తనకు బాగా హెల్ప్ చేసిన దర్శకుడు ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదట.
కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కృష్ణవంశీ కావడం విశేషం… కృష్ణవంశీ దగ్గర నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం, ఖడ్గం లాంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక అలాంటి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక కృష్ణవంశీ రవితేజల మధ్య గత కొన్ని రోజులకు కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయట. అందువల్లే కృష్ణ వంశీ రవితేజ గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక తనతో సినిమా విషయానికి వస్తే అతనితో సినిమా చేసే ప్రసక్తే లేదు అంటూ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటి అయితే ఇచ్చాడు.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందని అందరు అనుకున్నప్పటికి అది అంత పెద్దగా బిల్ట్ కాలేదు. నిజానికి రవితేజ కి అవకాశం ఇచ్చింది కృష్ణవంశీ అతన్ని హీరోగా నిలబెట్టింది కూడా కృష్ణవంశీ నే కావడం విశేషం… రవితేజ కృష్ణ వంశీ మధ్య దూరంగా పెరగడానికి కారణమేంటి అనే విషయంలో చాలా మంది చాలా రకాల ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు…
