Mahesh Babu First Salary: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుంది పోయే హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన ఇండస్ట్రీ కి ఎనలేని ఇవలను అందించాడు. ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలను చేసిన క్రెడిట్ కూడా తనకే దక్కింది. ఒక ఏడాదిలో ఆయన 18 సినిమాలు చేశాడు అంటే మామూలు విషయం కాదు. సినిమాలను చాలా తొందరగా చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కువగా పని కల్పిస్తూ ఉండేవాడు. అందువల్లే ఆయన హయాంలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. తన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడికి నచ్చేది. అందువల్లే ఆయన టాప్ లెవల్ లోకి వెళ్లిపోయాడు. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ‘వారణాసి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read: మన్మోహన్ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్!
ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యాయి. కానీ మొదటిసారి పాన్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు. రాజమౌళి ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు ఈ సినిమాని చాలా ఈజీగా చేయగలుగుతున్నాడు కానీ లేకపోతే మాత్రం అతనికి చాలా ఇబ్బంది ఎదురయ్యేది…
మొత్తానికైతే ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలని చూస్తున్నాడు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చేసిన ‘కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించాడు. కృష్ణ అతనికి పారితోషికాన్ని కూడా ఇచ్చాడట. అప్పట్లోనే మహేష్ బాబు కి రెమ్యూనరేషన్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు.
ఇక మహేష్ బాబు సైతం తన మొదటి సంపాదన గా 10,000 రూపాయలను సంపాదించాను అంటూ గతంలో ఒక సందర్భంలో తెలియజేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆయన దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాలు మరింత మ్యాజిక్ ను చేస్తే ఆయన స్థాయి మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే తన మార్కెట్ ను విపరీతంగా విస్తరింపజేసుకొని టాప్ లెవల్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి…
