Geethu Royal: గీతూ రాయల్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్ట్ చేసింది. హౌస్లో గీతూ రాయల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. ఒక దశలో బిగ్ బాస్ ఆమె కేంద్రంగా గేమ్ నడిపాడు. వారాలు గడిచే కొద్దీ కాంఫిడెన్స్ కాస్తా.. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ప్రేక్షకులకు ఆమె ప్రవర్తన విసుగు తెప్పించింది. అనూహ్యంగా గీతూ రాయల్ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. నేను బిగ్ బాస్ హౌస్ వీడనంటూ గీతూ రాయల్ గుక్క పెట్టి ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.
అనంతరం ఆమె బిగ్ బాస్ సీజన్ 7 బజ్ కి హోస్ట్ గా వ్యవహరించింది. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూలు చేసింది. ఫినాలే నాడు గీతూ రాయల్ కారుపై దాడి జరిగింది. కొందరు దుండగులు కారు అద్దాలు డ్యామేజ్ చేశారు. గీతూ రాయల్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. గీతూ రాయల్ గతంలో బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేది. సీజన్ 8కి తిరిగి రివ్యూలు స్టార్ట్ చేసింది.
తన రివ్యూలో గీతూ రాయల్ కంటెస్టెంట్ నాగ మణికంఠకు మద్దతుగా మాట్లాడింది. నామినేషన్స్ అనంతరం నాగ మణికంఠ ఏడుస్తూ తన విగ్గు తొలగించాడు. ఇంతకంటే నేను ట్రాన్సపరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. బయటకు వెళ్ళాక నా జీవితం ఏమవుతుందో తెలియదు… అంటూ విగ్గు తీసి విసిరేశాడు. పక్కనే ఉన్న కంటెస్టెంట్స్ అతన్ని ఓదార్చారు. నాగ మణికంఠ విగ్గు తొలగించడం పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
కొందరు రివ్యూవర్స్ సైతం అతనిపై ఎగతాళి పూర్వక కామెంట్స్ చేస్తున్నారు. కాగా మణికంఠను ట్రోల్ చేయడాన్ని గీతూ రాయల్ ఖండించింది. విగ్గు ధరిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకే మణికంఠ పూర్తి విగ్గు కూడా కాదు, ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. మహేష్ బాబుకి కూడా జుట్టు తక్కువగా ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని.. గీతూ రాయల్ అన్నారు.
మణికంఠ వివాదంలోకి ఎలాంటి సంబంధం లేని మహేష్ బాబు పేరును తేవడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. మహేష్ బాబు జుట్టును ఉద్దేశించి గీతూ రాయల్ మాట్లాడటం వారికి నచ్చలేదు. దీంతో ఆమెకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మహేష్ బాబును అవమానించిన నీ వీడియోలు ఇకపై చూడము, అని కామెంట్స్ చేస్తున్నారు. అనుకోకుండా మహేష్ బాబును విగ్గు విషయంలో ఉదాహరించిన గీతూ రాయల్ చిక్కుల్లో పడింది. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గీతూ రాయల్ ఎలా చల్లార్చుతుందో చూడాలి..
Web Title: Mahesh babu fans fire on bigg boss geethu royal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com