https://oktelugu.com/

Mahesh Babu Family: మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్

గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ లిరికల్ ధమ్ మసాలా బిర్యానీ పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల విడుదల చేసిన మాస్ సాంగ్ ' కుర్చీని పట్టి ' సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Written By: , Updated On : January 3, 2024 / 10:53 AM IST
Mahesh Babu Family

Mahesh Babu Family

Follow us on

Mahesh Babu Family: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ భాగంగా భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

ఇక గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ లిరికల్ ధమ్ మసాలా బిర్యానీ పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల విడుదల చేసిన మాస్ సాంగ్ ‘ కుర్చీని పట్టి ‘ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడతుండటంతో టీం ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు కారం టీం బాలయ్యతో అన్ స్టాపబుల్ షో లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఆ మధ్య మహేష్ బాబు, బాలయ్య షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా ఆ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ గుంటూరు కారం ఎపిసోడ్ కి మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు టీం మొత్తం హాజరు కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కి మహేష్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు 78 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అలాగే ఈ సినిమా ఓటిటీ గురించి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటిటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. కాగా సినిమా విడుదలైన 60 రోజులకు ఓటిటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని టాక్. దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అదే రేంజ్ లో ఈ సినిమాకు మార్కెట్ జరగబోతుందట. సినిమా నిర్మాతలు ఓవర్సీస్ రైట్స్ కోసం 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.