https://oktelugu.com/

మహేష్ కుమార్తె నుండి విలువైన మెసేజ్ !

కరోనా ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎవర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ కమ్మేస్తూ.. కుమ్మేస్తోంది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చుకుని క్వారెంటైన్ లో మగ్గిపోతున్నారు. మరోపక్క కరోనా రోజురోజుకూ రెచ్చిపోతూ ఉంది. కనిపించిన వాడిని కనిపించినట్లు కాటు వేయడానికి కాచుకుని ఉంది. అందుకే సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్ లు చేయించుకుంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికి అలా ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 11:06 AM IST
    Follow us on


    కరోనా ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎవర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ కమ్మేస్తూ.. కుమ్మేస్తోంది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చుకుని క్వారెంటైన్ లో మగ్గిపోతున్నారు. మరోపక్క కరోనా రోజురోజుకూ రెచ్చిపోతూ ఉంది. కనిపించిన వాడిని కనిపించినట్లు కాటు వేయడానికి కాచుకుని ఉంది. అందుకే సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్ లు చేయించుకుంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికి అలా ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు గారాల కూతురు సితార పాప కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది.

    Also Read: 2020 మూవీ రౌండప్.. కరోనా అల్లకల్లోలంలో హీరోలు !

    పైగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. టెస్ట్ కు సంబంధించిన వీడియోని కూడా సితార పాప పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా టెస్ట్ కు సంబంధించిన తన అనుభవాన్ని చెబుతూ.. నేను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి మొదట భయపడ్డాను. అయితే, ఆ సమయంలో నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని నాకు ధైర్యం చెప్పింది. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోడానికి ఎవ్వరూ భయపడొద్దు. టెస్ట్ లో భాగంగా నాకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. అందుకే మన ఆరోగ్యం, సమాజం కోసం అందరం టెస్టులు చేయించుకోవాలి ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్“ అంటూ సితార పాప పెద్ద మనసుతో మెసేజ్ పోస్ట్ చేసింది.

    Also Read: భారీ క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్ !

    మహేష్ బాబు అభిమానులకు.. మహేష్ సూపర్ స్టార్ అయినా, ఎంతో అభిమానం ఉన్నా.. మహేష్ కుమార్తె, ఆయన గారాలపట్టి సితార అన్నా కూడా వారికి అంతే అభిమానం. ఇక సితార ఫుల్ ఎనర్జిటిక్.. మహేష్ తో సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తనకంటూ అప్పుడే సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. పైగా లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి పూర్తి అయ్యేవరకు ‘నమ్రతా మహేష్’ సితారతో మహేష్ చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకోవడం, అవి భారీ స్థాయిలో వైరల్ అవ్వడం తెలిసిందే.

    Watch Video: https://www.instagram.com/p/CJaeX38HP6c/

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్