Mahesh Babu Daughter Sitara: పదేళ్లకే కోట్లు సంపాదిస్తున్న సితార… మహేష్ కూతురా మజాకా!

సీతారకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు సితార అప్డేట్స్ పై స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా సితారకు పరిచయాలు ఉన్నాయి. స్టార్ లేడీ అలియా భట్ ఇటీవల సితారకు ప్రత్యేకంగా బట్టలు బహుమతిగా పంపించింది.

Written By: Chai Muchhata, Updated On : May 27, 2023 10:16 am

Mahesh Babu Daughter Sitara

Follow us on

Mahesh Babu Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తుంటే ఆయన కూతురు సితార పట్టుమని పదేళ్లు నిండకుండానే సంచలనాలు చేస్తుంది. బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తుంది. సితార చేరుకున్న అరుదైన మైలురాయి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. సితార హైపర్ యాక్టివ్ గర్ల్. సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్స్ పెడుతుంటుంది. డాన్స్, సింగింగ్ వీడియోలతో పాటు తన టూర్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. పదేళ్ల పాపకు ఫ్యాన్స్ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం.

సీతారకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు సితార అప్డేట్స్ పై స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా సితారకు పరిచయాలు ఉన్నాయి. స్టార్ లేడీ అలియా భట్ ఇటీవల సితారకు ప్రత్యేకంగా బట్టలు బహుమతిగా పంపించింది. అలియా గిఫ్ట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సితార మరో పోస్ట్ పెట్టారు. అలియా భట్ గార్మెంట్స్ బ్రాండ్ కి సితార పరోక్షంగా ప్రచారం కల్పించింది.

సితారకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ప్రముఖ జ్యూవెలరీ సంస్థ ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. పి ఎం జె అనే ఈ జ్యూవెలరీ సంస్థ యాడ్ షూట్ లో సితార పాల్గొంది. పి ఎం జె లార్జెస్ట్ జ్యూవెలరీ చైన్ కలిగిన సంస్థ. ఇది భారీ కాంట్రాక్టు అని తెలుస్తుంది. సితార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. సితార సాధించిన అరుదైన రికార్డు పతాక శీర్షికలకు ఎక్కింది.

సితార సినిమాల్లో నటించలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కాదు. అయినా సోషల్ మీడియా ఫాలోయింగ్ తో ఈ అవకాశం అందిపుచ్చుకుంది. మహేష్ కూతురు కావడం వలన ఈ ఆఫర్ వచ్చిందని చెప్పలేం. సితార జోరు చూస్తుంటే త్వరలో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం ఖాయంగా కనిపిస్తుంది. సర్కారు వారి పాట మూవీలోని ‘పెన్నీ సాంగ్’ ప్రోమోలో సితార నటించిన విషయం తెలిసిందే. మహేష్ కూతురు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే కొడుకు గౌతమ్ మాత్రం రిజర్వ్డ్ గా ఉంటున్నాడు.