https://oktelugu.com/

Lasya Manjunath: మల్లెపూల పందిరి కింది లాస్య.. ఎవరితో ఉందో తెలుసా?

యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లాస్య బిగ్ బాస్ హౌస్ వ వరకు వెళ్లింది. తనతో యాంకర్ గా పనిచేసిన రవితో లవ్ ఎఫైర్ ఉందని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. అయితే కొన్నేళ్ల తరువాత మరోసారి వీరిద్దరు కలిసి ఓ కామెడీ షోలో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేలింది. అంతేకాకుండా రవితో తనకు ఎలాంటి ప్రేమాయణం లేదని లాస్య వివరించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 27, 2023 / 10:11 AM IST

    Lasya Manjunath

    Follow us on

    Lasya Manjunath: బుల్లితెరపై యాంకర్ గా వచ్చిన ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అయ్యారు.ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు టీవీల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే ఒక్కోసారి వారి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. ఓ మ్యూజిక్ చానెల్ లో యాంకర్ రవితో కలిసి పనిచేసిన లాస్య గురించి ఎవరూ మరిచిపోరు. పేరుకు తగ్గట్టుగానే ఆమె మొహంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్ డైలాగ్స్ తో ఈ షో ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. ఆ తరువాత మరికొన్ని చానెల్స్ లో యాంకర్ గానటించిన లాస్య కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్డేట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. లేటేస్టుగా ఈమె తన రెండో కొడుకు గురించి పోస్టు చేసిన పిక్స్ అలరిస్తున్నాయి.

    యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లాస్య బిగ్ బాస్ హౌస్ వ వరకు వెళ్లింది. తనతో యాంకర్ గా పనిచేసిన రవితో లవ్ ఎఫైర్ ఉందని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. అయితే కొన్నేళ్ల తరువాత మరోసారి వీరిద్దరు కలిసి ఓ కామెడీ షోలో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేలింది. అంతేకాకుండా రవితో తనకు ఎలాంటి ప్రేమాయణం లేదని లాస్య వివరించింది.

    అయితే మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించిన లాస్య ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మేమిద్దనం అన్యోన్యంగా ఉంటున్నామని లాస్య చెబుతోంది. ఏనాడు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదని, నన్ను మా వారు ఎంతో బాగా చూసుకుంటారని లాస్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో చెబుతూ ఎమోషనల్ అయింది. కొన్ని సినిమాల్లోనూ కనిపించిన లాస్య కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అందుకు కారణం ఉంది.

    కొన్ని నెలల కిందట లాస్య రెండో బాబుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా బాబుకు బారసాల నిర్వహించిన ఫొటోలు బయటకొచ్చాయి. తన బాబుకు మోక్ష అనిరుధ్ అని నామకరణం చేశారు. తన భర్తతో పాటు ఇద్దరు కుమారులతో కలిసి మల్లెపూల పందిరి కింద ఉన్న లాస్య ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో లాస్య ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే తన ఇద్దరు కొడుకులే తనకు జీవితం అంటూ లాస్య చెప్పుకొచ్చింది.