Mahesh Babu Daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. సితార సినిమాల్లోకి రాకుండానే భారీ ఫేమ్ క్రేజ్ సంపాదించింది. సీతారకు ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సితార షేర్ చేసే రీల్స్, వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా సితార నాన్న మహేష్ బాబు రీసెంట్ మూవీ గుంటూరు కారం సినిమాలోని పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గుంటూరు కారం లోని థమ్ మసాలా బిర్యానీ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి దుమ్ము రేపింది. సితార డాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అచ్చం ఒరిజినల్ సాంగ్ లో స్టెప్పులు దించేసింది. గతంలో కూడా గుంటూరు కారం మూవీ లోని ఓ మై బేబీ పాటకు క్యూట్ స్టెప్పులేసి సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇప్పుడు ఈ మాస్ డాన్స్ కు 50 లక్షల వ్యూస్ కొల్లగొట్టింది. సితార క్రేజ్ చూసి భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సితార కూడా తనకు యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. నమ్రత సైతం సితార సినీ ఎంట్రీ పై పలు సందర్భాల్లో మాట్లాడింది. సితార ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. అందులో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా పేద పిల్లలకు సాయం చేయడం, సేవా కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా మంచి మనసు చాటుకుంది. చిన్న వయసులోనే మోడల్ గా మారింది.
ఇది ఇలా ఉంటె .. సితార డాన్స్ చూసిన ఫ్యాన్స్ శ్రీలలని తలపిస్తుంది .. చెప్పాలంటే శ్రీలీలనే మించిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార హీరోయిన్ అయితే అందంలో, డాన్స్ లో సీతారను ఎవరు మించలేరు అని అంటున్నారు. ఏమైనా తండ్రికి తగ్గ కూతురు అనిపిస్తుంది.
Web Title: Mahesh babu daughter sitara dance on dum masala song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com