https://oktelugu.com/

Mahesh Babu- Sitara: వైరల్ అవుతున్న కళావతి పాటకు సితార స్టెప్పులు

Mahesh Babu- Sitara: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. ఈ కళావతి సాంగ్‌ యూట్యూబ్‌లో నెం-1గా ట్రెండ్‌ అయ్యింది. మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌తో పాటు కీర్తి సురేష్‌ అభినయాన్ని సినీ అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ పాటకు […]

Written By: , Updated On : February 21, 2022 / 11:36 AM IST
Follow us on

Mahesh Babu- Sitara: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. ఈ కళావతి సాంగ్‌ యూట్యూబ్‌లో నెం-1గా ట్రెండ్‌ అయ్యింది. మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌తో పాటు కీర్తి సురేష్‌ అభినయాన్ని సినీ అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు.

Mahesh Babu- Sitara

Mahesh Babu- Sitara

కాగా తాజాగా ఈ పాటకు మహేష్ కుమార్తె సితార స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొత్తానికి కళావతి పాటకు సితార స్టెప్పులు అదిరిపోయాయి. కాగా ఇప్పటి వరకూ 25 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా, 992 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నట్టు ఈ ‘కళావతి’ పాట టీచర్లకూ పాకింది.

Also Read:  ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?

ఓ తరగతి గదిలో ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గురించి వివరిస్తున్న లెక్చరర్.. కళావతి పాటను ఉదాహరణగా తీసుకున్నారు. మంచి ఉద్యోగాలు వస్తే జీతాలు.. ‘ఒక వందో, ఒక వెయ్యో, ఒక లక్షో..’ అంటూ వివరించారు. ‘కళావతి అని కాదు సరస్వతి.. సరస్వతి’ అని పాడుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

Mahesh Babu- Sitara:

Mahesh Babu- Sitara:

ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ సినిమాని మే 12, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏది ఏమైనా ఈ ‘కళావతి’ సాంగ్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

Tags