Mahesh Babu: 2020 ప్రారంభం లో కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది ఈ మహమ్మారి. దాదాపుగా రెండేళ్ల పాటు మూడు వేవ్స్ కారణంగా ప్రపంచం లోని పరిస్థితులు తలక్రిందులు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుండి పూర్తిగా కోలుకొని మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నాం. అయితే రీసెంట్ కొన్ని రోజుల నుండి ఆసియా ఖండం లోని దేశాల్లో కోవిద్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెల 10 నాటికి హాంకాంగ్లో అక్షరాలా 1042 కేసులు నమోదు అయ్యాయి. పోనిలే ఇతర దేశం లోనే కదా, మన దేశం సేఫ్ గానే ఉందని అనుకుంటే పొరపాటే. మన దేశం లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మరదలు, నమ్రతా శిరోద్కర్(Namrata shirodkar) సోదరి శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar) కరోనా బారిన పడ్డారు.
Also Read: ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!
ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిజేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురయ్యారు. హిందీ లో నటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శిల్పా శిరోద్కర్, గత ఏడాది హిందీ బిగ్ బాస్ 18 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. చివరి వారం వరకు ఆమె హౌస్ లో కొనసాగింది. ఒక ఎపిసోడ్ కి ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హౌస్ లోపలకు అడుగుపెడతాడు. ఇక నమ్రత శిరోద్కర్ అయితే శిల్పా శిరోద్కర్ నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో తమ సోదరి కి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఉండేది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే శిల్పా శిరోద్కర్ అకస్మాత్తుగా ఈ వార్త చెప్పడం తో అందరూ ఉలిక్కిపడ్డారు. నమ్రత కూడా ఆమెని చూసేందుకు ముంబై కి వెళ్లినట్టు తెలుస్తుంది.
అయితే కరోనా కొత్త రూపాంతరం చెందితే ఏదైనా ప్రమాదం ఉండొచ్చేమో కానీ, ప్రస్తుతం కరోనా వస్తే మాత్రం అది కేవలం ఒక మామూలు వైరల్ ఫీవర్ గా మాత్రమే ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఒకప్పుడు అంటే వాక్సిన్ లేకపోవడం వల్ల అంతమంది ప్రాణాలు పోయాయని, కానీ ఈసారి ఆ తరహా తీవ్రత ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బయటకి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం మళ్ళీ ప్రారంభించండి. కరోనా ఇక పూర్తిగా తగ్గిపోయింది, ప్రశాంతం గా ఉండొచ్చు అని అనుకుంటున్న సమయం లో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన మారణఖాండ ఎలాంటిదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన చేతుల్లో ఏమి లేదు కాబట్టి జాగ్రత్త గా ఉండడమే శరణ్యం.