Mahesh Babu And SS Rajamouli: నవంబర్ వచ్చేసింది..ఈ నెల మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ముఖ్యమైన నెల. ఎందుకంటే నెల లోనే మహేష్, రాజమౌళి కాంబినేషన్ కి సంబంధించిన కీలక అప్డేట్ రాబోతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలై దాదాపుగా 6 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం పై అభిమానుల్లో చాలా తీవ్రమైన అసహనం ఉండేది. కానీ మహేష్ బాబు పుట్టినరోజు నాడు నవంబర్ లో కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేయడం తో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు నవంబర్ నెల వచ్చేయడం తో నిన్న మహేష్ ట్విట్టర్ లో సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. నవంబర్ నెల ఇప్పటికే మొదలైంది అని రాజమౌళి ని ట్యాగ్ చేసి గుర్తు చేస్తాడు మహేష్ బాబు.
Also Read: డ్రాగన్’ మూవీ నుంచి ఎన్టీఆర్ ఫొటో లీక్ చేశారా..? పిక్ మామూలుగా లేదుగా…
అప్పుడు రాజమౌళి దానికి సమాధానం చెప్తూ ‘హా అవును..ఈ నెల ఏ సినిమాలకు రివ్యూస్ ఇవ్వాలని అనుకుంటున్నావు?’ అని అంటాడు. అప్పుడు మహేష్ బాబు ‘అవన్నీ తర్వాత..మీరు మాకు నవంబర్ నెలలో ఎదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అన్నారు. దయచేసి మాట తప్పకుండా నిలబెట్టుకోండి’ అని అంటాడు. అప్పుడు రాజమౌళి ‘ఇప్పుడే మొదలైంది మహేష్..చిన్నగా ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటుంది’ అని అంటాడు. అప్పుడు మహేష్ ‘ఇంత లేట్ ఏంటి సార్. నిదానంగా అంటే ఎప్పుడు?, 2030 లో మొదలు పెడుతారా?. ఈలోపు మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో తిరుగుతూ ఫోటోలు తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టేస్తాది’ అని అంటాడు. దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ ‘హలో హీరో..నువ్వు నాకు ఈ సినిమా గురించి చెప్పిన లీక్స్ అన్నీ ఇక్కడ చెప్పేయమంటావా?, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఏసేస్తా’ అని అంటుంది.
అప్పుడు రాజమౌళి మహేష్ బాబు ని ట్యాగ్ చేస్తూ ‘ఎందుకు లీక్ చేస్తున్నావ్ మహేష్?, నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ ని చెడగొట్టావు’ అని అంటాడు. అప్పుడు మహేష్ ‘సర్ప్రైజ్?, అంటే నీ దృష్టిలో పృథ్వి రాజ్ అప్డేట్ కూడా సర్ప్రైజ్ అని ఫీల్ అవుతున్నావా?’ అని అంటాడు. ఇలా వీళ్ళ మధ్య ఫన్నీ సంభాషణ జరుగుతూ ఉంటుంది. దీనిని చూసిన అభిమానులకు, నెటిజెన్స్ కి అర్థం అయ్యింది ఏంటంటే, త్వరలోనే ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న పృథ్వీ రాజ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారని. దీనిని నేరుగా చెప్పకుండా, ఇలా డిఫరెంట్ పద్దతి లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 16 న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
It’s November already @ssrajamouli
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025