Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీలో ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరిని తన యాక్టింగ్ తో ఫిదా చేస్తూ ఉంటాడు. అలాంటి మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించడం లేదు. దాంతో ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలోనే ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ‘వారణాసి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పడుతున్న కష్టం ఏంటో తెలియాలంటే స్క్రీన్ మీద చూడాల్సిందేనని సినిమా యూనిట్ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు… ఇక ఈ మూవీ తర్వాత మహేష్ బాబు క్రేజ్ అమాంతం పెరుగుతుంది.
కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో ఒక రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమా విమర్శకులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే ఆయన సినిమా సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా అతనికి భారీ డిజాస్టర్లు దక్కే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే వారణాసి సినిమాతో టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతటి గ్రేస్ ను మ్యాచ్ చేయాలంటే ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. ఒకవేళ ఏ మాత్రం తగ్గినా కూడా భారీ విమర్శలను మూటగట్టుకునే ప్రమాదం ఉంది. ఇక యాక్టింగ్ విషయంలో కూడా ఆయన ఎక్కడ తగ్గకూడదు.
ది బెస్ట్ ఇస్తూనే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించగలిగినప్పుడు మాత్రమే ఆయన నెంబర్ వన్ హీరోగా మారగలుగుతాడు. ఈ రెండు విషయాలను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగినంత కాలం అతనికి ఏ డోకా ఉండదు అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు…
