Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు కి కృష్ణ చెప్పిన ఆ ఒక్క మాట వల్లే స్టార్...

Mahesh Babu: మహేష్ బాబు కి కృష్ణ చెప్పిన ఆ ఒక్క మాట వల్లే స్టార్ హీరో అయ్యాడా..?

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కృష్ణ…తన కెరియర్ లో ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలను చేసి ఎన్నో టెక్నాలజీలను సైతం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి కృష్ణ తన నట వారసుడిగా మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా […]

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కృష్ణ…తన కెరియర్ లో ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలను చేసి ఎన్నో టెక్నాలజీలను సైతం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి కృష్ణ తన నట వారసుడిగా మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి ఆ తర్వాత వరసగా ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

ఇక అదే సమయంలో కృష్ణ మహేష్ బాబు కి ఒక సలహానైతే ఇచ్చాడట. ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ప్రేక్షకులు హీరో నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకు నచ్చిన సినిమాలు మనం చేయడం కాదు అని మహేష్ బాబుకి చెప్పారట. దాంతో మహేష్ బాబు అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అలాంటి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు.

దాంతో వరుస సక్సెస్ లను సాధించాడు. ‘ఒక్కడు’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసిన ఘనత మహేష్ బాబు కే దక్కింది…ఇక అలాంటి కృష్ణ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన సత్తా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఈ సినిమాతో ఎల్లలు దాటి ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటివరకు పాన్ ఇండియాలో కూడా ఆయన ఒక్క సినిమా చేయలేదు. అలాంటిది పాన్ వరల్డ్ లోకి వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు…మొత్తానికైతే మహేష్ బాబు కృష్ణ చెప్పిన మాటలను ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాడు కాబట్టి టాప్ పొజిషన్ చేరుకున్నాడు అంటూ అతని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper