Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రేరణ తో సుభాష్ రెడ్డి చేసిన పనికి ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ పాఠశాల వెనుక శ్రీమంతుడు ఒక ప్రేరణ అని తెలుసుకోవడానికి పదాలు రావడం లేదని అన్నారు. మీరే నిజమైన హీరో, మీలాంటి వారు మాకు ఇంకా కావాలి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత శ్రీమంతుడు బృందంతో తప్పకుండా సందర్శిస్తా అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021
ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ మూవీని ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.