Akhanda Movie: మాస్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా చెప్పుకొనే డైరెక్టర్ బోయపాటి శ్రీను, మాస్ సినిమాలో సక్సెస్ ఫుల్ అయినా హీరోగా నటసింహం బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ ఆదుకున్నాయి. లెజెండ్ తర్వాత వీరిద్దరికి మంచి హిట్ లేదు అనే చెప్పాలి. ఈ తరుణంలోనే మరోసారి హ్యాట్రిక్ దశలో దూసుకుపోతున్నారు ఈ మాస్ జంట.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం “అఖండ”మస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతోంది బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఈ సినిమాకి తమన్ స్వరాలందించారు. విలన్‌గా పాత్రలో హీరో శ్రీకాంత్ నటించారు. అయితే తాజాగా అఖండ సినిమా బృందం అభిమానులకు ఒక తీయటి కబురు చెప్పింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. కాగా నవంబర్ 15 న ట్రైలర్ ని విడుదల చేసి సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు మూవీ యూనిట్. ఈ నెల చివరన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.
అయితే ” అఖండ” సినిమా ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో. ఇప్పటికే ఓటీటీ ఆహా లో ప్రసారమవుతున్న టాక్ షో తో సక్సెస్ రేస్ లో దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.