Mahesh Babu Angry On Ajay Bhupathi: ఒక సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపాలి అంటే డైరెక్టర్ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని సక్రమంగా చేయాలి. అందులో ఏ ఒక్కరు చిన్న మిస్టేక్ చేసిన కూడా మొత్తం సినిమా మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు ఇతర డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి తనకు కావాల్సిన ఔట్ పుట్ ను రాబట్టుకోవడంలో తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఆయనకు ప్రతి క్రాఫ్ట్ మీద అంతో ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపైతే వస్తుంది. సక్సెస్ ఫుల్ సినిమాల్లో చేసిన వారికి మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలైతే వస్తాయి. ఫెయిల్యూర్ సినిమాలు చేసిన వాళ్లను ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో మొదటి సక్సెస్ ని సాధించిన దర్శకుడు అజయ్ భూపతి… ఆతర్వాత ఆయన చేసిన ‘మహా సముద్రం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ‘మంగళ వారం’ సినిమాతో తన పూర్తి టాలెంట్ ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం అజయ్ భూపతి మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ అనే సినిమా చేస్తున్నాడు… చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
అయితే ఈ సినిమా అవుట్ పుట్ ని రీసెంట్ గా మహేష్ బాబు చూశారట. మహేష్ బాబు సినిమా ఔట్ పుట్ మీద అంత సంతృప్తిగా లేడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే కొన్ని సీన్స్ ని మరోసారి రీషూట్ చేయమని మహేష్ బాబు చెప్పుతున్నట్టుగా తెలుస్తుంది.
దానికి అజయ్ భూపతి మాత్రం పర్ఫెక్ట్ గానే ఉంది. నేను అనుకున్నట్టుగానే వచ్చింది సినిమా రిజల్ట్ బాగొస్తుంది అని చెబుతున్నారట. మహేష్ బాబు మాత్రం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయవయ్యా ఇంకా బాగుంటుంది అంటూ అతని మీదికి కొంతవరకు ఫైర్ అయ్యాడు అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అజయ్ భూపతి వర్కింగ్ స్టైల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందనేది వాస్తవం. మహేష్ బాబు సైతం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి తన నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఆయన అనుకున్నట్టుగా అజయ్ భూపతి ఒకటి రెండు సీన్లను రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
