https://oktelugu.com/

మహేష్ తో సినిమా.. స్టార్ డైరెక్టర్ క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్పీడ్ పెంచారు. చిత్రాల నిర్మాణంలో జోష్ చూపిస్తున్నారు. ఇన్నాళ్లు కాస్త నెమ్మదిగా సాగిన కెరీర్ ను ప్రస్తుతం జోరు పెంచారు. ఇకనుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాల మధ్య ఎక్కువ విరామం ఉండకుండా చూసుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు తన చిత్రాలను వేగంగా చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న […]

Written By: , Updated On : July 19, 2021 / 06:44 PM IST
Follow us on

Mahesh Next Filmసూపర్ స్టార్ మహేష్ బాబు తన స్పీడ్ పెంచారు. చిత్రాల నిర్మాణంలో జోష్ చూపిస్తున్నారు. ఇన్నాళ్లు కాస్త నెమ్మదిగా సాగిన కెరీర్ ను ప్రస్తుతం జోరు పెంచారు. ఇకనుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాల మధ్య ఎక్కువ విరామం ఉండకుండా చూసుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు తన చిత్రాలను వేగంగా చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ బాబుకు జోడిగా నటిస్తోంది. సీనియర్ నటుడు అర్జున్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ స్పీడ్ కూడా పెరిగింది. మహేష్ బాబు అర్థరాత్రి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.

సర్కారు వారి పాట, త్రివిక్రమ్ ప్రాజెక్టుల అనంతరం మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అనేది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అనంతరం రాజమౌళితో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకాస్త టైమ్ పట్టవచ్చు కాబట్టి మధ్యలో జెట్ స్పీడ్ తో మరేదైనా సినిమాను పూర్తి చేయాలని మహేష్ ఆలోచిస్తున్నాడు.

అసలైతే సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం వంశీపైడిపల్లితో ఒక సినిమా చేయాలని అనుకున్న మహేష్ ఆ తరువాత వెంటనే అనిల్ రావిపూడితో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. స్టోరీ లైన్ ముందే సెట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఫుల్ స్కిృప్ట్ కూడా సిద్ధం చేసి ఉంచాడు. కానీ ఎందుకో ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. మహేష్ సడన్ గా పరశురామ్ ను లైన్ లో పెట్టి సర్కారు వారి పాటను సెట్స్ పైకి తెచ్చాడు.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. మహేష్ బాబుకు ఫుల్ స్కిృప్ట్ వినిపించి ఒకే చేయించినట్లు వివరణ ఇచ్చాడు. అయితే మహేష్ ఎప్పుడు ఒప్పుకుంటే సినిమా అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం అనిల్ ఎఫ్-3 సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

సర్కారు వారి పాట అనంతరం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలుస్తాడని క్లారిటటీ అయితే వచ్చింది. ఇక రాజమౌళి సినిమా అంటే వచ్చే ఏడాది ఉంటుంది. దీన్ని బట్టి అనిల్ రావిపూడి ఈ మధ్యలో సెట్టవ్వడం కష్టమే. ఒక వేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్రివిక్రమ్ సినిమాతో పాటు ఒకేసారి ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ లోపు అనిల్ రావిపూడి మరొక హీరోతో సినిమా మొదలు పెట్టవచ్చని టాక్ వస్తోంది.