https://oktelugu.com/

శ్రీలంకతో వన్డేల్లో భారత క్రికెటర్లు ఎందుకు అలా రెచ్చిపోయారో తెలుసా?

శ్రీలంక పర్యటనకు భారత బి గ్రేడ్ జట్టు వెళ్లింది. ప్రధాన జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తూ టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా సెకండ్ టీం శ్రీలంకలో పర్యటిస్తోంది. అయితే ఎక్కడా పెద్ద జట్టుకు తగ్గకుండా ఆడుతోంది. నిన్న జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై అన్ని రంగాల్లో ఆదిపత్యం చెలాయించి ఈజీగా గెలిచింది. శ్రీలంకను పసికూనలా భావించి చితక్కొట్టింది. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ టాస్ ఓడి కూడా భారత జట్టు కుర్రాళ్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2021 / 06:24 PM IST
    Follow us on

    శ్రీలంక పర్యటనకు భారత బి గ్రేడ్ జట్టు వెళ్లింది. ప్రధాన జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తూ టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా సెకండ్ టీం శ్రీలంకలో పర్యటిస్తోంది. అయితే ఎక్కడా పెద్ద జట్టుకు తగ్గకుండా ఆడుతోంది. నిన్న జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై అన్ని రంగాల్లో ఆదిపత్యం చెలాయించి ఈజీగా గెలిచింది. శ్రీలంకను పసికూనలా భావించి చితక్కొట్టింది.

    బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ టాస్ ఓడి కూడా భారత జట్టు కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. అందరూ కొత్తవాళ్లే అయినా కూడా ప్రత్యర్థిని చెడుగుడు ఆడేశారు. బౌలింగ్ లో ప్రతిభ చూపి చాలా తక్కువకే ఆలౌట్ చేసిన టీమిండియా ఆ తర్వాత కుర్రాళ్లు హిట్టింగ్ తో విరుచుకుపడడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్లు నిజంగానే పరుగుల విధ్వంసం సృష్టించారు. ఆడుతుంది వన్డే అయినా కూడా టీట్వంటీలా బ్యాటింగ్ చేశారు.ముఖ్యంగా ఓపెన్ ఫృథ్వీ షా దంచికొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్ సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫృథ్వీ షా 24 బంతుల్లోనే 9 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. భారత్ 5 ఓవర్లలోనే 57 పరుగులు చేసిందంటే ఫృథ్వీషానే కారణం.

    ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ సైతం చెలరేగాడు. తొలి బంతినే సిక్సర్ గా కొట్టి ఏమాత్రం భయం లేకుండా ఆడేశాడు. ఇషాన్ 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 59 పరుగులు చేశాడు. ఇక సూర్య కుమార్ సైతం 20 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు.

    వీళ్లంతా కుర్రాళ్లు ఇలా హిట్టింగ్ చేయడానికి ప్రధాన కారణం ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో ప్రారంభయ్యే టీ20 ప్రపంచకప్ నే. అందులో తమకు చాన్స్ రావడానికి సెలెక్టర్లను ఆకర్షించడానికి వీరంతా ఇలా దూకుడుగా బ్యాటింగ్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.