Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు అసలు తగ్గడం లేదుగా... రాజేంద్రప్రసాద్ తో చేసిన ఈ యాడ్...

Mahesh Babu: మహేష్ బాబు అసలు తగ్గడం లేదుగా… రాజేంద్రప్రసాద్ తో చేసిన ఈ యాడ్ చూశారా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్. పలు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పదుల సంఖ్యలో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు. సినిమాల కంటే కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువ ఆర్జిస్తున్నారు. తాజాగా ఆయన అభి బస్ కి సంబంధించిన యాడ్స్ చేశారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసిన యాడ్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా? అభి బస్ ఉందంటూ సదరు యాడ్ లో ప్రమోట్ చేశారు.

మహేష్ బాబు-రాజేంద్ర ప్రసాద్ చేసిన అభి బస్ యాడ్స్ లో కాన్సెప్ట్ తో పాటు కామెడీని హైలెట్ చేశారు. మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ యాడ్ ను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించారు. ఆయన గతంలో ఓ వర్కింగ్ స్టిల్ షేర్ చేస్తూ మహేష్ బాబుతో యాడ్ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు కొత్త యాడ్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సంక్రాంతికి ‘ గుంటూరు కారం ‘ తో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్స్ట్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ చాలా కొత్తగా ఉంటుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. కథకు తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు.

కాగా ఈ చిత్రం జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.స్క్రిప్ట్ పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కావాల్సి ఉంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. మే 31న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కలదు. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.
Go Where Your Heart Wants to, with AbhiBus! (Birthday Surprise film) {Telugu} | Maheshbabu

Exit mobile version