Saalar 2: ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ లేడీ… సలార్ 2పై అంచనాలు పెంచేసిన అప్డేట్!

సలార్ 2లో మొదటి భాగానికి మించిన యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు, ఊహించని మలుపులు ఉంటాయని ప్రశాంత్ నీల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Written By: S Reddy, Updated On : April 26, 2024 2:02 pm

Kiara Advani Joins Prabhas Salaar 2

Follow us on

Saalar 2: వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ప్రభాస్ మిత్రుడిగా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేశారు. ప్రభాస్-పృథ్విరాజ్ పాత్రల చుట్టే సలార్ కథ అల్లుకుని ఉంది. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సలార్ 2పై అంచనాలు పెరిగాయి. అలాగే అసలు కథ మొత్తం ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కోసం దాచి ఉంచాడు.

సలార్ 2లో మొదటి భాగానికి మించిన యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు, ఊహించని మలుపులు ఉంటాయని ప్రశాంత్ నీల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సలార్ 2 స్క్రిప్ట్ తుది దశకు చేరుకోగా వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో నటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారట. సలార్ 2 లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ నటిస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కియారా అద్వానీ సలార్ 2కి సైన్ చేశారట.

ప్రభాస్ తో కియారా రొమాన్స్ చేయడం ఖాయం అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రముఖంగా ప్రచారం అవుతుంది. సలార్ మూవీలో శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కియారా నటించడం నిజమైతే… శృతి స్థానంలో ఆమెను తీసుకున్నారా? లేక కియారా మరో పాత్రలో కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడుతుందనే వాదన వినిపిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. అమితాబ్, కమల హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సైతం చిత్రీకరణ దశలో ఉంది.