Mahesh Babu And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సక్సెస్ ఫుల్ సినిమాలైతే రావడం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవచ్చని ఉద్దేశంలో తనున్నాడు…
ఇక నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి గతంలో సన్నాహాలు చేసినప్పటికి రూపమైతే దాల్చలేదు. నిజానికి బాలయ్య బాబు అన్నగా మహేష్ బాబు తమ్ముడిగా ఒక సినిమాను బి.గోపాల్ ప్లాన్ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు.
ఇక వీళ్ళ కాంబోలో సినిమా వచ్చి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేశారు… బాలయ్య లాంటి నటుడు మహేష్ బాబు లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో కలిసి సినిమా చేస్తే అది వేరేలా ఉంటుందని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు ఫస్ట్ టైమ్ పాన్ వరల్డ్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక బాలయ్య బాబు తెలుగులో కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్లో మరో తెలుగు సినిమా వచ్చే అవకాశాలైతే లేవు…