https://oktelugu.com/

వైరల్: బంగారు తల్లులతో బన్నీ, మహేష్

ఆడపిల్ల.. అమ్మాయి అంటే కొన్ని దశాబ్ధాలుగా సమాజంలో చులకన.. అమ్మాయిని కడుపులోనే చంపేసే సమాజం మనది. అయితే ఆడిపిల్లలంటే తండ్రులకు పంచప్రాణాలు.. ఆ బంగారు తల్లులు తల్లుల కంటే తండ్రుల వద్దే చనువు ఎక్కువ. మన స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులకు వాళ్లు కూతుంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ల గారాల పట్టిలతో సరదాగా ఆడుకోవడం ఇష్టం. తాజాగా రెండు పిక్ లు మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు తమ కూతుళ్లు అంటే ఎంత […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2021 / 08:14 PM IST
    Follow us on

    ఆడపిల్ల.. అమ్మాయి అంటే కొన్ని దశాబ్ధాలుగా సమాజంలో చులకన.. అమ్మాయిని కడుపులోనే చంపేసే సమాజం మనది. అయితే ఆడిపిల్లలంటే తండ్రులకు పంచప్రాణాలు.. ఆ బంగారు తల్లులు తల్లుల కంటే తండ్రుల వద్దే చనువు ఎక్కువ.

    మన స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులకు వాళ్లు కూతుంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ల గారాల పట్టిలతో సరదాగా ఆడుకోవడం ఇష్టం. తాజాగా రెండు పిక్ లు మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు తమ కూతుళ్లు అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాయి.

    కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లు బంద్ కావడంతో అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణలో నవారు మంచం వేసుకొని సాధారణ ప్రజల్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి పడుకొని ఆకాశంలోని చుక్కలు లెక్కబెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. కొడుకు పక్కనే ఉండగా.. కూతును దగ్గరకు తీసుకొని మరీ ఊసులాడుతున్న ఆ వీడియోను బన్నీ భార్య షేర్ చేయగా వైరల్ అయ్యింది.

    ఇక మహేష్ భార్య నమ్రత కూడా ఒక అరుదైన మహేష్-కూతురు సితారా ఫొటోను పంచుకుంది. మహేష్ బాబు తన గారాల బేబిని ప్రేమగా హత్తుకొని హాయిగా నిదిరిస్తున్న ఫొటో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘వేకువ జామున బేబీని అలా కౌగిలించుకొని నిదురపోవడం మస్ట్.. అలా చేయకపోతే ఉదయమే నిదుర లేవలేం..’ అని నమ్రత ఫొటో షేర్ చేసిన మహేష్ ఫ్యాన్స్ కు ఆహ్లాదాన్ని పంచుతోంది.