కాంగ్రెస్ లో వీహెచ్ చిచ్చు

పీసీసీలో రచ్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ సారధి వద్దని బుకాయిస్తున్నారు. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే గాంధీ భవన్ కు ఎవరినీ రానీయరని సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్టు ప్రకటించబోతున్నారని తెలియగానే తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమందికి గిట్టడం లేదు. ఎక్కడ పార్టీ పుంజుకుంటుందని అనుకున్నారో లేక ఇతర పార్టీలకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో ఏమో రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో హనుమంతరావు, […]

Written By: Srinivas, Updated On : June 3, 2021 8:16 pm
Follow us on

పీసీసీలో రచ్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ సారధి వద్దని బుకాయిస్తున్నారు. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే గాంధీ భవన్ కు ఎవరినీ రానీయరని సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్టు ప్రకటించబోతున్నారని తెలియగానే తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమందికి గిట్టడం లేదు.

ఎక్కడ పార్టీ పుంజుకుంటుందని అనుకున్నారో లేక ఇతర పార్టీలకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో ఏమో రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో హనుమంతరావు, జగ్గారెడ్డి ముందు వరసలో ఉంటారు. జగ్గారెడ్డి హుందాగా వ్యవహరించినా వీహెచ్ మాత్రం బాహాటంగానే విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వద్దని వారిస్తున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే రెడ్డిలకు ఇచ్చినట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని సూచించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే గాంధీభవన్ కు ఎవరిని రానివ్వరని చెప్పారు. అప్పుడే తనను ప్రెస్ మీట్ పెట్టనీయడంలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే ఆయన జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వీహెచ్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సొంత పార్టీలోని నేతలతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. వీహెచ్ లాంటి వారి రగడ పార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపరచడానికి వీహెచ్ లాంటి వారు చేస్తున్న రచ్చ సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.