Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘శ్రీ సూర్య డెవలపర్స్’ అనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు ఈడీ అధికారులు ఆయన్ని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కుంభకోణం లో చిక్కుకున్న సూర్య డెవలపర్స్ సంస్థ ఎంతో మంది అమాయకులచేత పెట్టుబడులు పెట్టించి మోసం చేసిందని, అలాంటి సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించాడని, చెక్ రూపం లో 3 కోట్ల 50 లక్షలు, ఆన్లైన్ ద్వారా 2 కోట్ల 50 లక్షలు, మొత్తం మీద 6 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడని ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ నెల 27 న విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు కి 22 వ తేదీన ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
నేడు ఆయన విచారణకు వస్తాడని అంతా ఆశించారు కానీ, షూటింగ్ లో ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేనని, వేరే డేట్ ని ప్రకటించాలని ఆయన ఈడీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశాడు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు, కేవలం వర్క్ షాప్ మాత్రమే జరుగుతుంది. రెండవ షెడ్యూల్ ని వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. మరి మహేష్ బాబు షూటింగ్ లో ఉన్నాను, రాలేనని ఎందుకు చెప్పాడు?, వర్క్ షాప్ లో పాల్గొంటూ అలా చెప్పాడా?, లేకపోతే ఏదైనా కమర్షియల్ యాడ్ షూటింగ్ లో బిజీ గా ఉంటూ రాలేకపోయాడా అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ బాబు ఎప్పుడు విచారణకు హాజరు కాబోతున్నాడా అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇకపోతే రాజమౌళి తో చేస్తున్న సినిమా ఇటీవలే ఒడిశా లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ సెట్ లో మహేష్ బాబు మూడు వేల మందితో పోరాడబోతున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ సుకుమారన్ లు కూడా పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక ఇక నీరు గా విదేశాల్లోనే చిత్రీకరణ మొదలు అవుతుంది. అందుకోసంగా విదేశాల్లో డ్రైవింగ్ చేయడం కోసం రాజమౌళి రీసెంట్ గానే ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యూవల్ చేసుకున్నాడు. నాన్ స్టాప్ గా షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసి, 2027 మార్చి నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు.
Also Read: రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ని మ్యూట్ లో పెట్టాను: నాని