Bigg Boss 9 Telugu: నిన్న ‘బిగ్ బాస్'(Bigg Boss 9 Telugu) హౌస్ లో జరిగిన ఇమ్మ్యూనిటీ టాస్క్ ని మీరంతా చూసే ఉంటారు. ఈ టాస్క్ లో అద్భుతంగా ఆడిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్, రీతూ చౌదరి, దివ్య నిఖిత అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. గుంపుగా కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళతో పోరాడి గెలవడానికి చేసిన ఫైటింగ్ సాధారణమైనది కాదు. ముఖ్యంగా డిమోన్ పవన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇమ్మానుయేల్, భరణి, పవన్ కళ్యాణ్ వంటి బలమైన కంటెస్టెంట్స్ గుంపుగా టార్గెట్ చేసి కిందకు పడేయాలని చూసారు. కానీ డిమోన్ పవన్ పడలేదు, వాళ్ళతో బలంగా ఫైట్ చేసాడు. డిమోన్ ని క్రిందకు పడేయడానికి ప్రయత్నం చేసి భరణి ఆయనకంటే ముందు క్రిందకు పడిపోయాడు. న్యాయం గా చూస్తే భరణి ఆ రౌండ్ నుండి ఎలిమినేట్ అవ్వాలి, కానీ సంచాలక్స్ రాము రాథోడ్, ఫ్లోరా షైనీ డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేయడం అన్యాయం అనిపించింది.
అంతకు ముందు రాము రాథోడ్ ఎవరైతే ముందుగా కాళ్ళు క్రింద పెడుతారో, వాళ్ళు ఎలిమినేట్ అని రూల్ పెడుతాడు. ఆ రూల్ ప్రకారం చూస్తే డిమోన్ పవన్ కంటే ముందుగా భరణి కాళ్ళు క్రింద పెడుతాడు. సంచాలక్ గా ఉన్న మహేష్ భరణి ని తొలగించాలి. కానీ ఆయన తనని కెప్టెన్ ని చేసాడు అనే కృతజ్ఞతతో, తన తోటి సంచాలక్ ఫ్లోరా షైనీ ని కూడా ప్రభావితం చేసి డిమోన్ ని తప్పించడం దారుణం అని అనిపించింది. డిమోన్ కూడా గట్టిగా దీని కోసం ఫైట్ చేయలేదు, అతని స్నేహితురాలు రీతూ చౌదరి కూడా ఈ అన్యాయాన్ని నిలదీయలేదు. భరణి కోసం తనూజా ప్రశ్నించింది, అలా రీతూ చౌదరి కూడా ప్రశ్నించి ఉండుంటే బాగుండేది. కానీ ఆమె తన గోలలో పడిపోయి డిమోన్ కి సపోర్టు గా నిలబడలేదు.
ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, భరణి అబద్దాలు చెప్పడం. డిమోన్ కంటే ముందు తానే క్రింద పడ్డాను అనే విషయం భరణి కి స్పష్టంగా తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన డిమోన్ ముందుగా కాళ్ళు పెట్టాడు అంటూ వాదించి, సంచాలక్ మహేష్ ని తప్పు దోవ పట్టించాడు. మహేష్ కూడా ఇదంతా చూసాడు కానీ, తన గురువు కే ఓటు వేసాడు. ఈ విషయం పై కచ్చితంగా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున భరణి, మహేష్ లను నిలదీసే అవకాశం ఉంది. ఈ ఒక్క ఎపిసోడ్ తో భరణి బాగా నెగిటివ్ అయిపోయాడు. ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయి ఉండొచ్చు. చాలా మందికి భరణి మాస్క్ తీస్తే ఇంత దారుణంగా ఉంటాడా అని అనిపించింది. చూడాలి మరి ఈ నెగిటివిటీ నుండి ఆయన మళ్లీ ఎలా కం బ్యాక్ ఇస్తాడు అనేది.