Mahesh And Rajamouli Movie Title Launch Event: రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో చేస్తున్న చిత్రానికి మన టాలీవుడ్ స్టార్ హీరోల సహకారం తీసుకోనున్నాడా?..మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం కాబట్టి, మన తెలుగు సినిమాకే గర్వకారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానివ్వకుండా ఈ సినిమాని మన స్టార్ హీరోలతో ప్రమోట్ చేయించే కార్యక్రమం పెట్టుకున్నాడా అంటే అవుననే అంటున్నారు. నిన్న విడుదల చేసిన స్పెషల్ వీడియో అందుకు ఒక ఉదాహరణ. ఈ వీడియో ని నవంబర్ 15న జరగబోయే ఈవెంట్ కి రిలేటడ్ గా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు ప్రభాస్ సినిమాలకు వాళ్ళ అభిమానులు చేసిన హంగామా కి సంబంధించిన క్లిప్స్ ని ఉపయోగించారు. మహేష్ సినిమా కి ఇతర హీరోల వీడియోస్ క్లిప్స్ ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏంటి?.
మహేష్ బాబు ఒక పెద్ద సూపర్ స్టార్. ఆయనకు మాత్రమే అంకితం చేసే విధంగా ఉండాల్సిన ఈ సినిమాకు సంబంధించిన వీడియో లో ఇతర హీరోల ప్రస్తావన అవసరమా అని మహేష్ అభిమానులు నిన్న ట్విట్టర్ లో కాస్త రాజమౌళి పై అసహనం వ్యక్తం చేశారు. అయితే అసలు విషయం వేరే ఉంది. నవంబర్ 15 న రామోజీ ఫిలిం సిటీ లో జరగబోయే ఈ ఈవెంట్ కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా సర్ప్రైజ్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ ఈవెంట్ కి మన టాలీవుడ్ స్టార్స్ అందరూ రాబోతున్నారని టాక్. అందరికీ రాజమౌళి ప్రత్యేకంగా ఆహ్వానం అందించాడట. కానీ ఇది మీడియా కి లీక్ అవ్వకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. కానీ ఈవెంట్ తేదీ దగ్గరకు రావడం తో ఈ వార్త లీక్ అయ్యింది.
స్టార్ హీరోలంతా వచ్చినా రాకపోయినా రాజమౌళి తో కలిసి ఇప్పటి వరకు పని చేసిన ప్రభాస్,ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కచ్చితంగా వస్తారట. #RRR మూవీ ప్రారంభోత్సవానికి కూడా ప్రభాస్, రానా వంటి వారు విచ్చేసారు. ఈసారి రాజమౌళి హీరోలంతా వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లకు కూడా ఆహ్వానం అందిందట. అల్లు అర్జున్ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనేది అనుమానం. అభిమానులు పవన్, మహేష్ లు ఒకే వేదిక పై కనపడి చాలా కాలం అయ్యింది. ఒకవేళ వీళ్లిద్దరు కలిసి ఒకే స్టేజిపై కనిపిస్తే ఆడిటోరియం దద్దరిల్లిపోవడం ఖాయం అనే చెప్పాలి.