Mahavatar Narsimha OTT: చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha). కేజీఎఫ్ మేకర్స్ ‘హోమబుల్ ఫిలిమ్స్'(Homable Films) మరియు ‘క్లిమ్ ప్రొడక్షన్స్'(Kleem Productions) సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ కన్నడ చిత్రం గత నెల 25 వ తారీఖున విడుదలైంది. తెలుగు లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కొనుగోలు చేసి గ్రాండ్ గా విడుదల చేసాడు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. సాక్ష్యాత్తు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్నే ఈ సినిమా అనేక ప్రాంతాల్లో డామినేట్ చేసే రేంజ్ లో వసూళ్లను రాబట్టిందంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో గంటకు పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అలాంటి సినిమా ఓటీటీ లోకి త్వరలోనే రాబోతుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.
Also Read: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..
ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాని భారీ రేట్ కి కొనుగోలు చేసిందని, ఆగష్టు 20వ తేదీన ఈ చిత్రం ఆ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని, ఇలా పలు రకాల వార్తలు చాలా రోజుల నుండి ప్రచారం అవుతుంది. ఇవి నిర్మాతలు వరకు చేరడంతో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించారు. వాళ్ళు మాట్లాడుతూ ‘మహావతార్ నరసింహా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా సరికొత్త మైల్ స్టోన్స్ ని కూడా దాటబోతుంది. ఈ క్రమం లో ఈ చిత్రాన్ని మేము ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మేశామని, ఈ నెల 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుందని వార్తలు ప్రచారం అవ్వడం మా దృష్టికి వచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదు. మేము ఈ సినిమాని ఇంకా ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదు. దయచేసి అసత్య వార్తలు నమ్మకండి, ఏదైనా ఉంటే అధికారికంగా మేమే మా ప్రొడక్షన్ హ్యాండిల్స్ నుండి తెలుపుతాము’ అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి ఎట్టకేలకు చెక్ పడినట్టే. అయినా ఇలాంటి సినిమాలను థియేటర్స్ లో చూస్తేనే మజా. థియేటర్స్ లో ఇలాంటి చిత్రాలను చూస్తే వచ్చే కిక్, అనుభూతి వేరు. కాబట్టి థియేటర్స్ లోనే చూడండి, 3D లో అయితే సినిమా అదిరిపోయింది. మీరు పెట్టిన టికెట్ రేట్ కి వెయ్యి రేట్లు ఆనందం పొందుతారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక లైవ్ యానిమేషన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందంటే అందులో ఎలాంటి విషయం ఉందో ఈపాటికే ఈ సినిమాని చూడని వాళ్లకు అర్థం అయ్యి ఉండాలి.