Bigg Boss 9 Telugu Fraud: మన ఇండియా లో బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది ప్రసారం అవ్వబోయే సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ షోని చూసినప్పుడల్లా ప్రతీ ఒక్కరికి మేము కూడా ఈ షో లో పాల్గొని సెలబ్రిటీలు అయిపోవచ్చు కదా అనే ఆశ ఉంటుంది. అందుకే ఈసారి మన తెలుగు ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లో ఈసారి సామాన్యులకు కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం అందించారు. లక్షల్లో వచ్చిన ధరఖాస్తులలో ఒక 40 మందిని ఎంచుకొని ‘అగ్నిపరీక్ష’ అనే పోటీ ద్వారా 8 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఈ ప్రక్రియ ని బిగ్ బాస్ టీం చాలా నిజాయితీగా, పక్క ప్రణాళిక తో ఒక పద్దతితో ప్రకారం చేసుకుంటూ ముందుకు పోతుంది. అర్హత ఉన్నవారినే లోపలకు పంపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది.
Also Read: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..
అయితే బిగ్ బాస్ లోకి బ్యాక్ డోర్ ద్వారా లోపలకు పంపిస్తామని చెప్పి మీ దగ్గర లక్షల రూపాయిలను దోచుకొని మోసం చేసే దుండగులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో సామాన్యులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గానే బిగ్ బాస్ పేరుతో ఒక భారీ మోసం జరిగింది. భోపాల్ రాష్టానికి చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు, డాక్టర్ అభినిత్ గుప్తాను ఇలాగే మోసం చేసాడు ఒక వ్యక్తి. బిగ్ బాస్ షో లోకి బ్యాక్ డోర్ పద్దతి లో పంపుతానని చెప్పి తన వద్ద అక్షరాలా 10 లక్షల రూపాయిలు తీసుకొని మోసం చేశారని రీసెంట్ గానే ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అభినిత్ గుప్త భూపాల్ లో ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ ని నడుపుతున్నాడు. ఇతనికి 2022 లో కరణ్ సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
తాను బాలీవుడ్ లో ఈవెంట్ డైరెక్టర్ అని, టీవీ నిర్మాణ సంస్థలతో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని, తనకి 10 లక్షల రూపాయిలు డబ్బులు ఇస్తే బిగ్ బాస్ షో లోకి ప్రవేశం కల్పిస్తానని మాయ మాటలు చెప్పి 10 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గానే హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా బయటకి వచ్చింది. అందులో అభినిత్ గుప్తా పేరు లేదు. దీంతో ఆయన కరణ్ సింగ్ ని నిలదీసే ప్రయత్నం చేసాడు, కానీ ఆయన అందుబాటులో లేదు. ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం మానేసాడు. దీంతో గుప్త పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలాంటివి ఇప్పుడు మన దగ్గర కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సామాన్యులకు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి. అందుకే ఇకపై సామాన్యులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. బిగ్ బాస్ కి బ్యాక్ డోర్ ద్వారా వెళ్లిపోవచ్చు అనే అపోహ ఉంటే వెంటనే మర్చిపోండి. అలాంటివి ఉండవు.