Mahavatar Narsimha vs Coolie: ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, మంచి సినిమా తీస్తే నెలల తరబడి భారీ థియేట్రికల్ రన్ ఇస్తున్నారు, చెత్త సినిమా తీస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా రెండవ రోజే తోక్కేస్తున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణలు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘వార్ 2′(War 2 Movie) చిత్రాలే. భారీ తారాగణం తో వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఆడియన్స్ కనీసం మూడు రోజుల థియేట్రికల్ రన్ కూడా ఇవ్వలేదు. కానీ తక్కువ బడ్జెట్ తో తీసిన ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) అనే కన్నడ యానిమేషన్ చిత్రం ఇప్పటికీ భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుంది. రీసెంట్ గా విడుదలైన ఆ రెండు భారీ చిత్రాల కారణం గా ‘మహావతార్ నరసింహా’ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్స్ నుండి తీసేసారు. కానీ ఆ రెండు సినిమాలకు పెద్దగా టాక్ రాకపోవడంతో మళ్ళీ ‘మహావతార్ నరసింహా’ కి థియేటర్స్ పెంచారు.
నేటి హైదరాబాద్ బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి తెరిచి చూస్తే ‘మహావతార్ నరసింహా’ చిత్రం ఏకంగా ‘కూలీ’ చిత్రాన్నే డామినేట్ చేసింది. కూలీ చిత్రానికి హైదరాబాద్ లో 5 హౌస్ ఫుల్ షోస్ పడితే, ‘మహావతార్ నరసింహా’ కి ఏకంగా 27 షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇది సాధారణమైన విషయం కాదు, 20 రోజులు క్రితం విడుదలైన సినిమా, నాలుగు రోజుల క్రితం విడుదలై 400 కోట్ల రూపాయలకు పైగా రాబట్టిన సినిమా ని కూడా డామినేట్ చేసిందంటే కంటెంట్ పవర్ కి జనాలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మాత్రమే జనాలు ఇలాంటి లాంగ్ రన్ సినిమాలను చూసేవారు, ఓటీటీ కాలం లో మళ్ళీ చూడగలమా అని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. చూస్తుంటే మరో రెండు వారాలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని దున్నేసేలాగా అనిపిస్తుంది. ఓటీటీ లోకి ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదట, ఎందుకంటే ఈ చిత్రాన్ని ఇంకా ఏ ఓటీటీ కి అమ్మలేదట.
థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగదు అనే నమ్మకం నిర్మాతలకు కూడా ఉంది. రాబోయే సినిమాలైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఈ చిత్రం ఊపు కాస్త తగ్గుతుంది. లేదంటే ఈ సినిమా డామినేషన్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం విడుదలయ్యే వరకు కొనసాగే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఎన్ని మ్యాజిక్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఈ చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గరగా వసూళ్లను రాబట్టింది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు నాలుగు వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రం ‘కూలీ’ ని భారీ మార్జిన్ తో డామినేట్ చేసే అవకాశం ఉంది.