Mahavatar Narasimha Box Office: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టిస్తున్న భీభత్సం సాధారమైనది కాదు. ఈ ఏడాది వాళ్ళ కోసమే రాసి పెట్టి ఉందేమో. పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఒక పక్క తీవ్రమయిన నిరాశకు గురి చేస్తుంటే, చిన్న సినిమాలు మాత్రం పెద్ద సినిమాల రేంజ్ లో ర్యాంపేజ్ వేస్తున్నాయి. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) అనే యానిమేటెడ్ కన్నడ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. కేవలం కన్నడ లో మాత్రమే కాదు, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఉగ్రరూపం చూపిస్తూ క్రేజీ చిత్రాలను సైతం డామినేట్ చేస్తుంది.
Also Read: ‘జల్సా’ రీ రిలీజ్ ఈసారి సక్సెస్ అవ్వడం కష్టమే..ఎందుకంటే!
ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 9 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. పది రోజుల క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) చిత్రానికి బుక్ మై షో లో గంటకు 7 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతుంటే, ఎప్పుడో జులై 25 న విడుదలైన ‘మహావతార్ నరసింహా’ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డామినేషన్ ని చూపించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఇక హైదరాబాద్ లో ఏ రేంజ్ డామినేషన్ నడుస్తుందంటే, మహావతార్ నరసింహా చిత్రానికి 77 కి ఫాస్ట్ ఫిల్లింగ్ షోస్ ఉంటే, కూలీ చిత్రానికి కేవలం 7 షోస్ మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి వచ్చాయి. ఎంతో క్రేజీ కాంబినేషన్ తో వచ్చిన సినిమా కూడా నేడు ఒక కంటెంట్ ఉన్న చిన్న సినిమా ముందు తల వంచింది.
Also Read: మహేష్ బాబు హీరోగా పనికిరాడని చెప్పిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఇప్పటికైనా మేకర్స్ జనాలు థియేటర్స్ కి రావడం ఆపేసారు వంటి అసత్య ప్రచారాలు చేయకుండా, దమ్మున్న సినిమాలు తీస్తే చాలని, ప్రేక్షకులు థియేటర్స్ కి కదిలి బ్రహ్మరథం పడుతారని అంటున్నారు. చిన్న సినిమాలే ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీలను సృష్టిస్తూ ఉంటే, ఇక పెద్ద సినిమాలు సరైన కంటెంట్ తో వస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఊహించుకోవచ్చు. రాబోయే పెద్ద చిత్రాల్లో దగ్గర్లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మాత్రమే ఉంది. మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ట్రేడ్ లో మామూలు రేంజ్ లో లేవు. కనీసం ఈ పెద్ద సినిమా అయినా ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి.