Mahavatar Narasimha Collections: కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. గత నెల 25 న ఈ చిత్రం విడుదలైంది. ఈ గ్యాప్ లో జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు విడుదలై థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి కూడా. కానీ ‘మహావతార్ నరసింహా’ చిత్రం మాత్రం ఇప్పటికీ విజయవంతంగా ఆడుతూనే ఉంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘కూలీ’,’వార్ 2′ లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రాలను కూడా ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో డామినేట్ చేస్తుంది.
Also Read: ‘వార్ 2’ నిర్మాతలను కాపాడిన చిన్న సినిమా..ఇది లేకుంటే పాపం ఏమయ్యేవారో!
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ట్రెండ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని, నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ డామినేట్ చేస్తున్నాయి. అక్కడి ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ చిత్రానికి 165 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం బాలీవుడ్ లో దాదాపుగా 153 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ‘మహావతార్ నరసింహా’ ఆ కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో అధిగమించి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా ఊపు చూస్తుంటే రాబోయే రోజుల్లో కచ్చితంగా కల్కి కలెక్షన్స్ ని కూడా దాటేస్తుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘కల్కి’ చిత్రానికి ఫుల్ రన్ లో 185 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం హోల్డ్ చేయగలిగితే కచ్చితంగా ‘కల్కి’ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read: రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
సెప్టెంబర్ నెలలో కొత్త సినిమాలు చాలానే విడుదల అవుతున్నాయి. వాటికి హిట్ టాక్ వస్తే పర్వాలేదు కానీ, పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం నరసింహ స్వామి మరోసారి తాండవం ఆడేస్తాడు. సెప్టెంబర్ 25 న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదల కాబోతుంది. పరిస్థితులు అనుకూలిస్తే అప్పటి వరకు ఈ చిత్రం థియేటర్స్ లో దిగ్విజయం గా ఆడే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే వండర్ అనే చెప్పొచ్చు. లైవ్ యానిమేషన్ ట్రెండ్ నడుస్తున్న ఈ కాలం లో ఒక సాధారణ యానిమేషన్ చిత్రం ఈ రేంజ్ ప్రభంజనం సృష్టించడం నిజంగా ఆ దేవుడి లీలనే అని అంటున్నారు. ఒకవేళ ఇదే సినిమాని లైవ్ యానిమేషన్ చిత్రం గా తీసి ఉండుంటే ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు.