Mahanati Savitri Birth Anniversary: తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి ఎన్నో వందల మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు..కానీ మహానటి అంటే మాత్రం నేటి తరం ప్రేక్షకులు కూడా మరో పేరు ఆలోచించకుండా సావిత్రి అని చెప్తారు..తెలుగు ప్రేక్షకుల మనసులో ఆమె ఏర్పర్చుకున్న స్థానం అలాంటిది..నటులకు చావు లేదు.. వాళ్ళు చిరంజీవులు..తెలుగు నేల బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు గుర్తు ఉంటారు అనే దానికి నిదర్శనమే సావిత్రి.
నటన లో ఆమె ఒక మహా గ్రంధాలయం..ఏ పాత్రలో అయినా ఆమెకి నటించడం అస్సలు రాదు..కేవలం జీవించడం మాత్రమే వచ్చే..మహానటులు ఎన్టీఆర్ , ANR , ఎస్ వీ రంగారావు వంటి మహానటులు కూడా సావిత్రి తో కలిసి నటించడానికి కాస్త జంకేవారు..ఎందుకంటే ఆమె తన హావభావాలతో సన్నివేశాలలో ఎక్కడ తమని డామినేట్ చేస్తుందో అని భయం..నటన లో అలాంటి ట్రేడ్ మార్కు ని ఏర్పాటు చేసుకున్నారు సావిత్రి..అయితే ఈమెకి కూడా అవకాశాలు అంత తేలికగా రాలేదు.
సావిత్రి ‘పురస్కారం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..ఇందులో ఎన్టీఆర్ , ANR హీరోలు..ముందుగా సావిత్రి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు..కానీ ఆడిషన్స్ లో సెలెక్ట్ కాలేదు..నువ్వు హీరోయిన్ గా పనికిరావు..హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రలు వెయ్యడానికే పనికొస్తావని సావిత్రి ని ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రని ఇచ్చారు..ఈ సంఘటన సావిత్రిని చాలా నొచ్చుకునేలా చేసింది..నేను ఎందుకు హీరోయిన్ కాలేను..ఎవరైతే నన్ను అవహేళన చేసారో..వాళ్ళే నా డేట్స్ కోసం ఎదురు చూసేలా చేస్తాను అనే కసితో ఆమె పని చెయ్యడం ప్రారంభించింది..అలా దేవదాసు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది..అక్కినేని నాగేశ్వర రావు హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఒక చరిత్ర..ఈ సినిమా తర్వాత సావిత్రి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
తెలుగు మరియు తమిళం బాషలలో అగ్ర హీరోలతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ని సంపాదించింది..అయితే ఆమె వెండితెర జీవితం ఎంత వెలుగులతో నిండిందో..వ్యక్తిగత జీవితం అంత విషాదకరంగా సాగిపోయింది..అవన్నీ మనం మహానటి సినిమాలో చూసే ఉంటాము..ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకుంటూ ఆమె పవిత్రమైన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకుంటుంది అనే ఆశిద్దాం.