Mahalakshmi Ravindar
Mahalakshmi Ravindar: కొద్దీ రోజుల క్రితం కోలీవుడ్ ఇండస్ట్రీ లో పాపులర్ అయిన జంటలలో మహాలక్ష్మి, రవీందర్ ఒకరు. వీళ్ళ గురించి ప్రస్తుతం అందరికి తెలుసు ఎందుకంటే వీళ్ల పెళ్లి టైం ల్లోనే వీళ్లు బాగా పాపులర్ అయ్యారు. ఎలా పాపులర్ అయ్యారంటే మహాలక్ష్మి చూడటానికి చాలా సన్నగా క్యూట్ గా హీరోయిన్ లాగా ఉంటుంది, రవీందర్ మాత్రం చాలా లావు గా ఉంటాడు.
దింతో వీళ్ళిద్దరికి ఎలా సెట్ అయింది అంటూ చాలా మంది డౌట్లని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేసారు.అయితే ఆ అమ్మాయి అతన్ని డబ్బుకోసమే పెళ్లి చేసుకుంటుంది అని మరికొందరు కామెంట్లు చేసారు, అయినప్పటికీ వాళ్లిదరు కొద్దీ రోజులు కలిసి ఉన్నారు మధ్యలో కొన్ని గొడవలు కూడా జరిగినట్టు గా మీడియా లో చాలా వార్తలు వచ్చాయి.అలాగే విడాకులు కూడా తీసుకున్నట్టుగా చాలా కథనాలు వచ్చాయి.
అయితే ఇక ఆ గొడవల విషయం పక్కన పెడితే ప్రస్తుతం రవీందర్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు.ఎందుకు అంటే అయన బిజినెస్ నిమిత్తం ఒక వ్యక్తి దగ్గర 15 కోట్ల రూపాయల తీసుకున్నట్టు గా ఒక చెన్నై పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దింతో చెన్నై పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకోగా, పోలీసుల విచారణలో బాలాజీ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి రవీందర్ 15 కోట్ల రూపాయలు తీసుకొని అతన్ని మోసం చేసినట్టు గా తేలింది.ఇక దాంతో ఆయన ప్రస్తుతం జైలు లో ఉన్నారు. ఈయనకి తన భార్య అయిన మహాలక్ష్మి బెయిల్ తీసుకు రావడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ బెయిల్ మాత్రం రావడం లేదు…
ఇక ఇది ఇలా ఉంటె రీసెంట్ గా మహాలక్ష్మి డాన్స్ చేసిన ఒక వీడియో నెట్ లో తెగ వైరల్ గా మారింది.ఇది చూసిన జనాలు నీ భర్త అరెస్ట్ అయి జైల్లో ఉంటె నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తూ వీడియోలు పెడుతున్నావ్ నీకు కొంచమైనా బుద్ది ఉందా అయన జైలు లో ఉన్నాడు అనే భాద లేకూండా అలా డాన్స్ చేస్తున్నావ్, అయిన నువ్వు ఆస్తి కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నావ్,ఆయనంటే నీకు ఇష్టం లేదు అందుకే అతన్ని డబ్బు కోసం పెళ్లి చేసుకొని నువ్వే కావాలని అతన్ని జైలు కి పంపించినట్టు ఉన్నావ్ ఇప్పుడు ఆయన ఆస్తిని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు…