https://oktelugu.com/

Actor Nani: ఫ్యాన్స్ కు సర్ప్రైస్ ఇచ్చిన… నేచురల్ స్టార్ నాని ?

Actor Nani: నాచురల్‌ స్టార్‌ నాని గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తనదైన నాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంటుంది. నాని ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్‌ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అయితే తాజాగా నాని తన తర్వాతి సినిమా నుంచి బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చాడు. దసరా పండుగ రోజున తన […]

Written By: , Updated On : October 13, 2021 / 08:36 PM IST
Follow us on

Actor Nani: నాచురల్‌ స్టార్‌ నాని గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తనదైన నాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు ఈ యంగ్ హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంటుంది. నాని ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్‌ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అయితే తాజాగా నాని తన తర్వాతి సినిమా నుంచి బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చాడు. దసరా పండుగ రోజున తన 29 వ సినిమాను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాడు. 15 వ తేదీన మధ్యాహ్నం 1.53 గంటలకు తన 29 వ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ… ట్విట్టర్‌ వేదికగా అనౌన్స్ చేసి అభిమానులకు సర్ప్రైస్ ఇచ్చాడు నాని.

actor-nani-surprise-his-fans-by-announcing-new-movie

దీంతో నాని అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యకాలంలో నానికి సరైన హిట్టు పడలేదని చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో విడుదల కాగా… అవి ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో తన తదుపరి సినిమాలతో హిట్స్ అందుకోవాలని నాని భావిస్తున్నట్లు అర్దం అవుతుంది. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ రూపొందిస్తోన్న ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని ” గే ” క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.  నానికి జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాని మరో సినిమాను పట్టాలెక్కించడం పట్ల ఆయన అభిమానుల్లో మరింత జోష్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.