తమిళ స్టార్ హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న హీరో ‘విజయ్’ రెమ్యునరేషన్ దాదాపు 60 కోట్లు. కానీ, ప్రభుత్వ కరోనా నివారణ నిధికి రూ.లక్ష రూపాయిలు కట్టను అంటూ తేల్చిచెప్పాడు. పైగా విజయ్ కు ఆ రూ.లక్షను జరిమానాగా విధించింది కోర్టు. అయినా ప్రభుత్వ కరోనా నివారణ నిధికి తనకు లక్ష కూడా చెల్లించడం ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్.
అసలు ఇంతకీ విజయ్ కి లక్ష ఎందుకు జరినామా విధించారు అంటే.. విజయ్ ఇంగ్లాండ్‌లో కొనుగోలు చేసిన రోల్స్‌రాయిస్ కారుకు సంబంధించిన ట్యాక్స్ అట అది. ఆ ట్యాక్స్ కట్టలేదని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణియం విజయ్ కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా విజయ్ ఆ లక్ష కట్టేదే లేదు అని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
మొత్తానికి విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రత్యేక న్యాయస్థానం ఆ ఉత్తర్వుల పై తాత్కాలిక స్టే విధించగా, ఈ విషయంపై మళ్ళీ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఎం సుబ్రమణ్యం సమక్షంలో బుధవారం విచారణ జరిగింది. ఈ విచారంలో భాగంగా జరిమానాను ప్రభుత్వ కరోనా నివారణ నిధికి ఎందుకు చెల్లించలేదు అని న్యాయమూర్తి విజయ్ ను ప్రశ్నించారు.
అయితే, ఆ ప్రశ్నకు విజయ్ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. ‘గత ఏడాది ప్రభుత్వ కరోనా నివారణ నిధికి విజయ్ రూ.25 లక్షలు అందించారని, కాబట్టి.. అదనంగా మరో రూ.లక్ష జరిమానాను కరోనా నివారణ నిధిగా చెల్లించడం విజయ్ కి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. దాంతో చేసేదేం లేక విజయ్ పై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చాడు. అయినా 60 కోట్లు తీసుకుంటూ లక్ష కోసం ఇలా కోర్టు మెట్లు ఎక్కడం ఏమిటో !!