Madhya Pradesh CM: ఈ మధ్య బాలీవుడ్ లో తెలుగు సినిమాల హవా విపరీతంగా పెరిగిపోతోంది. బాహుబలితో మొదలైన పాన్ ఇండియా వేవ్.. ఆ తర్వాత పుష్ప క్రేజ్ తో పాటు.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ రూపంలో దేశం సినిమారంగాన్ని ఊపేస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ తెలుగు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తెలుగు సినిమాలపై సంచలన కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లో నిర్వహించిన తెలుగు సంగమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలుగు వారసత్వాన్ని, గౌరవాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా తెలుగు సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సినీ నటుడు అలీ, కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలతో తెలుగు ప్రజలు మమేకమై జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్ చేశారు. తెలుగు సినిమాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారాయని.. అక్కడి నుంచే పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: RRR 23 Days : ఇంకా అదే ఊపు.. కారణం అదే ?
బాహుబలి చూసి తామంతా ఫిదా అయ్యామని, అప్పటి నుంచి తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాలుగా మారాయన్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగుజాతిని ప్రపంచం గుర్తించే విధంగా చేస్తే.. ఇప్పుడు ప్రభాస్ తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు కొత్త మార్గదర్శకంగా తెలుగు సినిమాలు మారాయని.. మిగతా ఇండస్ట్రీ వాళ్ళంతా తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నారంటూ వివరించారు.
రానున్న రోజుల్లో తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాను మరింత ప్రభావితం చేస్తాయని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు సినిమాల గురించి ఎంత గొప్పగా మాట్లాడటం విశేషంగానే చెప్పుకోవాలి. పైగా ఆయన తెలుగు ముఖ్యమంత్రి కూడా కాదు. అలాంటిది ఇంత బాగా తెలుగు సినిమాల గురించి ఆయన వివరించడం ఏంటని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు.
Also Read: Janasena: మత్స్యకారులకు ఆశాదీపంగా పవన్ కళ్యాణ్.. జనసేన వైపు గంగపుత్రుల చూపు