https://oktelugu.com/

Krishna Vrinda Vihari: “కృష్ణ వ్రింద విహారి” రాక అప్పుడే.. హిట్ కొడతాడా ?

Krishna Vrinda Vihari: “కృష్ణ వ్రింద విహారి”.. అబ్బా ఈ సినిమా టైటిల్ ఏమిటి ఇంత సాఫ్ట్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో ? అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, తన బలం అయిన, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని, నాగశౌర్య ఈ సినిమా చేస్తున్నాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 18, 2022 / 01:09 PM IST
    Follow us on

    Krishna Vrinda Vihari: “కృష్ణ వ్రింద విహారి”.. అబ్బా ఈ సినిమా టైటిల్ ఏమిటి ఇంత సాఫ్ట్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో ? అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, తన బలం అయిన, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని, నాగశౌర్య ఈ సినిమా చేస్తున్నాడు.

    Krishna Vrinda Vihari

    అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మే 20న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కారణం.. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కుదిరాయి. ‘కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా..’ అంటూ మొదలైన ఈ టీజర్ ఆకట్టుకుంది.

    Also Read: F3 New Poster: ‘ఎఫ్ 3’ కొత్త పోస్టర్.. తమన్నా అందమే మెయిన్ హైలైట్ !

    మెయిన్ గా టీజర్ లో లవ్ తో కూడిన రొమాంటిక్ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. రొమాన్స్ పాళ్లు కూడా ఎక్కువ శాతం ఉండటంతో ఈ సినిమా పై బయ్యర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో.. హీరోయిన్ ప్రేమ కోసం పడే ఆరాటం దగ్గర నుంచి.. అతన్ని చూడగానే ఆమె చూపించే అలకలు వరకూ.. అలాగే మధ్యలో హీరో బుజ్జగింపులు కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.

    ఇక ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర హీరో చెప్పే డైలాగ్ కూడా టీజర్ లో బాగా హైలైట్ అయ్యింది. మొత్తానికి టీజ‌ర్ ఆధ్యాంతం ఆక‌ట్టుకుంటుంది కాబట్టి.. సినిమాకి మంచి మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. యువ సంగీత దర్శకుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగుంది.

    విజువ‌ల్స్ కూడా చాలా బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకు జోడిగా షిర్లే సేటియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు యంగ్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలని కోరుకునే ‘నాగశౌర్య’కి ఈ సినిమా సూపర్ హిట్ ను అందించాలని ఆశిద్దాం.

    Also Read: Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

    Tags