Madhrasi Movie First Review: గతంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుండేది.అయితే గత కొన్ని రోజుల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ సినిమా కూడా ప్రేక్షకుడిని అలరించలేకపోతోంది…కారణం ఏదైనా కూడా మురుగదాస్ లాంటి దర్శకుడు చాలా సంవత్సరాల నుంచి తన ఫామ్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక దాంతో ఆయన శివ కార్తికేయన్ తో కలిసి చేసిన మదరాసి అనే సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అంటూ కోలీవుడ్ మీడియా లో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ‘మదరాసి’ సినిమా ఎలా ఉంది దాని ఫస్ట్ రివ్యూ చూసిన తర్వాత సినిమా మేకర్స్ ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శివ కార్తికేయన్ చెన్నైలోని తన ఫ్యామిలీతో పాటు బతుకుతూ ఉంటాడు. ఇక అనుకోకుండా కొంతమంది దుర్మార్గుల చేతిలో తన ఫ్యామిలీని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. దాంతో తన ఫ్యామిలీని తనకు దూరం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకొని ఎలాగైనా సరే చంపేయాలి అనే కసితో హీరో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే అనుకోని నిజాలు సైతం హీరోకి తెలుస్తాయట.
మొత్తానికైతే అసలు కథ తెలుసుకున్న హీరో తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడా? లేదా అనేది సినిమా స్టోరీ గా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మురుగదాస్ ఈ సినిమాను యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను అలరించినప్పటికి సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిపాటు బోర్ కొట్టే అవకాశాలైతే ఉన్నాయట.
ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అదిరిపోయే టెస్ట్ లతో మురుగదాస్ దీనిని మలిచినట్టుగా తెలుస్తోంది…ఆయన మరోసారి తన మార్క్ ను టచ్ చేస్తూ సోషల్ మెసేజ్ ని కూడా ఇందులో చెప్పినట్టుగా తెలుస్తోంది… ఇక విజువల్స్ పరంగా కూడా సినిమాకి చాలావరకు హెల్ప్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక శివ కార్తికేయన్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటూ కోలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వస్తున్నాయి.
ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడట…మ్యూజిక్ విషయంలో కూడా అక్కడక్కడ తడబడ్డప్పటికి కొంతవరకు పర్లేదని చెబుతున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమా ఈనెల 5 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…