Madhavireddy – Minister Roja : నటి మాధవి మంత్రి రోజా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాము స్నేహితులం అని, కలిసి చదువుకున్నట్లు తెలిపింది. పైగా రోజా కెరీర్ స్టార్టింగ్ లో ఎటువంటి పాత్రలు చేసింది. ఎలా ఉండేదో .. రోజాతో ఆమెకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకుంది. మాధవి రెడ్డి క్యారక్టర్ ఆర్టిస్ట్. సినిమాలు, సీరియల్స్ లో నటిస్తుంది. ఎక్కువగా తల్లి పాత్రల్లో మెప్పిస్తుంది. కాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
రోజా 1991 లో ‘ప్రేమ తపస్సు’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. రాజేంద్ర ప్రసాద్ ఇందులో హీరోగా చేశారు. హీరోయిన్ గా రోజా నటించింది. ఈ సినిమాలో రోజా పాత్ర గురించి నటి మాధవి రెడ్డి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా రోజా తాను క్లాస్ మేట్స్ అని చెప్పింది. డిగ్రీ చేసేటప్పుడు ఒకే కాలేజ్ లో చదువుకున్నట్లు, రోజా స్టడీస్ లో ఫస్ట్ ఉండేది అని తెలిపింది. చాలా తెలివిగా, స్పాంటేనియస్ గా ఉండేది అని అన్నారు.
రోజాకి ‘ ప్రేమ తపస్సు ‘ లో అవకాశం వచ్చినప్పుడు ఆ షూటింగ్ కి ఫ్రెండ్స్ అంతా వెళ్లామని, అందులో రోజా పనిమనిషి క్యారెక్టర్ చేసిందని తెలిపింది. పని మనిషి పాత్ర నీకు బాగా సరిపోయింది, నల్లగా ఉంటావని ఎగతాళి చేసేవాళ్ళం అని మాధవి రెడ్డి చెప్పారు. ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి షో జరుగుతున్నప్పుడు మళ్లీ కలిశామని తెలిపింది. కానీ రోజా ఆమెను గుర్తుపట్ట లేదని, అందుకే సైలెంట్ గా ఉండిపోయానని మాధవి అన్నారు.
రోజా తమిళ్ లో చేసిన ఒక సినిమా బాగా పేరు తెచ్చిపెట్టిందని, దీంతో స్టార్ గా ఎదిగింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చాలా ఇంటెలిజెంట్ .. మాట తీరు బాగుంటుంది. ధైర్యం ఉంది. అందుకే రాజకీయాల్లో రాణించగలుగుతుంది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మంత్రిగా ఎదిగింది. ఆ ధైర్యం లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టం అని నటి మాధవి చెప్పుకొచ్చారు.