Mad Square First Review: యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ ని పర్ఫెక్ట్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని వసూళ్లు వస్తాయి అని అనడానికి ఇటీవల కాలం లో ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపించాయి. రీసెంట్ గా విడుదలైన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. గతంలో మన టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో మ్యాడ్ చిత్రం యూత్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా సంగీత్ శోభన్(Sangeeth Sobhan) , నార్నే నితిన్(Narne Nithin) వంటి వారికి మంచి పేరు కూడా వచ్చింది. ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ కి మన ఆడియన్స్ మొత్తం ఫిదా అయిపోయారు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యి, మొదటి కాపీ కూడా సిద్ధమైందట. రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాని కొంతమంది ప్రముఖులకు, బయ్యర్స్ కి వేసి చూపించారట. వాళ్ళ నుండి రెస్పాన్స్ అదిరిపోయిందట. సినిమా చూసి బయటకి వస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. ఆ రేంజ్ లో ఈ చిత్రం నవ్వించి నవ్వించి కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కే సినిమా బ్లాక్ బస్టర్ అనే ఫీల్డ్ ని రప్పిస్తుందట. ఒకటి కాదు రెండు కాదు, సినిమా మొదలైనప్పటి నుండి ఎదో ఒక పంచ్ రావడం, హీరోలు వేసే తింగరి వేషాలకు నవ్వు రావడం వంటివి జరుగుతాయట.
ఇక సెకండ్ హాఫ్ అయితే కామెడీ వేరే లెవెల్ లో పండింది అని అంటున్నారు. హీరోలు గోవాకి వెళ్లినప్పటి నుండి ఆడియన్స్ సీట్స్ మీద కూర్చోరట, ఆ రేంజ్ ఫన్ ఉంటుందని సమాచారం. అందరూ ఊహించినట్టే ఈ సినిమాలో కూడా సంగీత్ శోభన్ కామెడీ నే హైలైట్ గా ఉంటుందని సమాచారం. కామెడీ ని అమితంగా ఇష్టపడే వాళ్ళు పదే పదే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి చూసేంతగా ఉందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ చిత్రం నిజంగా ఉందా లేదా అనేది తెలియాలంటే మార్చి 28 వరకు ఆగాల్సిందే. సాధారణంగా ఈ చిత్రాన్ని 29 న విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, ఆరోజు అమావాస్య అని బయ్యర్స్ చెప్పడంతో ఒక రోజు ముందుకు వాయిదా వేశారు. ఈ చిత్రానికి పలు చోట్ల విడుదలకు ముందు రోజే పైడ్ ప్రీమియర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…