Mad Square : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్న సినిమాలలో ఒకటి ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలు అయ్యాయి. ఇప్పటికే టీజర్ ద్వారా ఈ సినిమాపై బజ్ మామూలు రేంజ్ లో ఏర్పడలేదు, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్(Mad Square Trailer) అంతకు మించిన రేంజ్ లో ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకుంది. ట్రైలర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పంచుల మీద పంచులు, ఒక్కటి కూడా కుళ్ళు జోక్ లాగా అనిపించలేదు. టీజర్ లో విలన్ ‘భాయ్’ అంటూ బేస్ వాయిస్ తో డైలాగ్ చెప్తే, ఒక భాయ్ అని డీడీ కాల్ కట్ చేస్తాడు. ఆ షాట్ బాగా హైలైట్ అయ్యింది. ట్రైలర్ లో కూడా అలాంటి షాట్ పెట్టాడు డైరెక్టర్.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ లో హైలెట్స్, ప్రధాన లోపాలు ఇవే…
కానీ ఈసారి భాయ్ అని పిలిస్తే పండు క్యారక్టర్ ‘నేను బాయ్స్ తో మాట్లాడను,కేవలం అమ్మాయిలతోనే మాట్లాడుతాను’ అని అంటాడు. ఇది కూడా చాలా ఫన్నీ గా అనిపించింది. గోవా లో కార్ లో వెళ్తున్నప్పుడు కార్ నుండి తల బయటకు పెట్టి అరుస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా, ఒక వ్యక్తి తల మీద బీర్ బాటిల్ తో కొడుతాడు. ఎవరు రా వీళ్ళు ఇంత గలీజ్ ఉన్నారు అంటే తెలుగోళ్లు అయ్యుంటారు అంటూ హీరో క్యారక్టర్ తో డైలాగ్ వేయించడం సోషల్ మీడియా లో కాస్త నెగటివిటీ కి దారి తీసింది. తెలుగోళ్లు అంటే అంత చులకనా?, మన భాషకు చెందిన వాళ్లపై డైరెక్టర్ ఇలాంటి డైలాగ్ పెట్టడం ఏమిటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి డైలాగ్ పెట్టడం వెనుక డైరెక్టర్ ఉద్దేశ్యం ఏమిటి?, కేవలం ఫన్ కోసం ఇలాంటివి రాస్తారా అని తిడుతున్నారు.
కేవలం ఆ ఒక్క డైలాగ్ మాత్రమే కాంట్రవర్సీ కి దారి తీసింది కానీ, ఓవరాల్ థియేట్రికల్ ట్రైలర్ కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మ్యాడ్ మొదటి భాగం కంటే రెండవ భాగం లోనే కామెడీ ఎక్కువగా వర్కౌట్ అయ్యినట్టుగా అనిపించింది. ఇంతకీ ఆ భాయ్ క్యారక్టర్ చేసిన నటుడు ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వాయిస్ చూస్తుంటే అది సీనియర్ హీరో శ్రీకాంత్ లాగ అనిపిస్తుంది. అది సునీల్ అవ్వొచ్చు, వెన్నెల కిషోర్ కూడా అవ్వొచ్చు కదా అని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ ఎలిమెంట్ మాత్రం సస్పెన్స్ గానే ఉంటుందట సినిమాలో కూడా. అంతే కాకుండా ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేసారు, ఇంకో పాట సర్ప్రైజ్ గా థియేటర్స్ లోనే ఉండేలా ప్లాన్ చేశారట. ఓవరాల్ గా పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వుకునే కామెడీ ఈ సినిమా ద్వారా అందబోతుందని తెలుస్తుంది.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయేంటి!