Mad Square Trailer : ప్రస్తుతం సినిమా స్పాన్ అనేది పెరిగిపోయింది. ప్రతి డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక హీరోలు సైతం ఒకరిని మించి మరొకరు సూపర్ సక్సెస్ లను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…అందులో కొందరికి సక్సెస్ లు వస్తే మరికొందరికి వరుసగా ప్లాప్ లు వస్తున్నాయి…యంగ్ డైరెక్టర్లు మాత్రం మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి మంచి సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు… నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లాంటి యంగ్ హీరోలు కలిసి చేసిన ‘మ్యాడ్’ (MAD) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు మ్యాడ్ స్క్వెర్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈనెల 28వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ మొత్తం ఎంటర్ టైనింగ్ గా కట్ చేసినప్పటికి ట్రైలర్ ని కనుక చూసినట్లయితే చాలా గందరగోళంగా ఈ సినిమా ఉండబోతుంది అనేది తెలుస్తోంది. ముఖ్యంగా సంగీత్ శోభన్ ఈ సినిమాలో బాగా హైలెట్ కాబోతున్నాడు అనేది కూడా తెలుస్తోంది… ట్రైలర్ ను బట్టి చూస్తే మాత్రం ఇందులో మొత్తం కుళ్ళు జోకులే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు వచ్చిన మ్యాడ్ సినిమాలో కొంతవరకు కామెడీ పర్లేదు అనిపిస్తుంది.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయేంటి!
కానీ ఈ సినిమాలో మాత్రం మొత్తం కుళ్ళు జోకులతోనే కామెడీ చేయించినట్టుగా తెలుస్తోంది. సిచ్ వేషనల్ కామెడీ కాకుండా ఏదో సినిమాను నడిపించాలి కాబట్టి కొన్ని కామెడీ సీన్స్ ను క్రియేట్ చేసి మరి ఈ సినిమాలో కామెడీని జెనరేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో కొంత ఎమోషన్ ని మిక్స్ చేసి కామెడీతో సినిమాను లాగించాలి అనుకున్నారు.
కానీ ఈ జోకులకి ఇప్పుడున్న ప్రేక్షకులు నవ్వే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే టీవీలోనే పుష్కలంగా కామెడీ కంటెంట్ దొరుకుతుంది. కొన్ని షోలల్లో వచ్చే జోకులు సైతం ఇంతకంటే బావుంటాయి. దానికోసం ప్రత్యేకించి మరి ఒక సినిమా చేసి అందులో ఇలాంటి కుళ్ళు జోకులను మిక్స్ చేయడం అనేది అంత పెద్దగా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు.
కేవలం లడ్డు పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ ను మాత్రమే ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. కామెడీ మాత్రమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఇలాంటి జోకుల వల్ల సినిమాకి మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఇలాంటి కుళ్ళు జోకులతో కొన్ని సినిమాలైతే వర్కౌట్ అవుతాయి. కానీ ఇది అన్నివేళలా వర్కౌట్ అవ్వదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది…
Also Read : తెలుగు రాష్ట్రాల్లో నిరాశపర్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ అడ్వాన్స్ బుకింగ్స్!