Mad Square : యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా విడుదలై కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, వర్కింగ్ డేస్ లో మాత్రం వసూళ్లు భారీగా పడిపోతున్నాయి. బుక్ మై షో లో నిన్న ఈ చిత్రానికి కేవలం 16 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. ఆరవ రోజు ఈ చిత్రానికి కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వస్తే, 7వ రోజు కోటి రూపాయిల లోపు షేర్ వసూళ్లు వచ్చాయి అంట. ఓవరాల్ గా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్..ఫ్యాన్స్ కి నో ఎంట్రీ!
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి వారం 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాలవారీగా లెక్కలు పరిశీలిస్తే నైజాం లో 11 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో 3 కోట్ల 20 లక్షలు,ఉత్తరాంధ్ర లో 3 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో కోటి 95 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 75 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 45 లక్షలు, నెల్లూరు జిల్లాలో 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో నిన్న ఈ చిత్రం 1 మిలియన్ మార్కు ని అందుకుంది. ఓవరాల్ గా ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక ప్రాంతాలకు కలిపి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా సూపర్ హిట్, ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ అందరూ లాభాల్లోకి వచ్చేసారు, కానీ అనుకున్న టార్గెట్ ని మాత్రం రీచ్ అవ్వలేకపోయింది ఈ చిత్రం. ఈ విషయం నిర్మాత నాగవంశీ కూడా కాస్త అసంతృప్తి తో ఉన్నట్టు టాక్. మొదటి వారం లోనే 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని ఆశించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఫుల్ రన్ లో 70 కోట్ల గ్రాస్ కూడా వచ్చేలా లేదు. ఈ వీకెండ్ ఈ చిత్రానికి చివరి బెస్ట్ వీకెండ్ అవ్వొచ్చు. ఎందుకంటే వచ్చే వారం చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.
Also Read : రోజురోజుకు పడిపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..6వ రోజు ఎంత వచ్చిందంటే!