Jack
Jack : ‘టిల్లు స్క్వేర్’ లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటిస్తున్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్'(Jack – Konchem Krack). బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న మూవీ టీం ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, హీరో సిద్దు లో ఇంకా టిల్లు క్యారక్టర్ షేడ్స్ నుండి బయటకు రాలేదు అనే విమర్శలు కూడా వినిపించాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ వెర్షన్ దాదాపుగా సిద్దు నే రాశాడు. ఆయన మార్క్ ప్రతీ షాట్ లోనూ కనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షోని ఇటీవలే కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారట.
Also Read : సిద్ధూ ‘జాక్’ ట్రైలర్ వచ్చేసింది..బొమ్మరిల్లు భాస్కర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా!
వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సిద్దు సినిమాల నుండి యూత్ ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో, అవన్నీ ఈ చిత్రం లో ఉన్నాయట. కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాలలో బాగా కుదిరాయని, క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసారని, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇచ్చే ట్విస్టులు, సిద్దు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు మొత్తం బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పార్ట్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ అదిరిపోయిందని, ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత థియేటర్స్ నుండి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారని చెప్పుకొస్తున్నారు. కానీ సినిమాలో ఉన్న ప్లస్ సిద్దు, మైనస్ కూడా సిద్ధునే అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే డీజే టిల్లు మోడ్ లోనే సీరియస్ సన్నివేశాల్లో హీరో ఉండడం కాస్త ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయట.
కేవలం ఆ ఒక్క మైనస్ పాయింట్ తప్ప, సినిమా మొత్తం చాలా బాగా వచ్చిందని, లవ్ స్టోరీస్ చేసుకునే బొమ్మరిల్లు భాస్కర్ ఇలాంటి యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కూడా తీయగలడా అని ఆడియన్స్ ఆశ్చర్యపోయే విధంగా అతని స్క్రీన్ ప్లే ఉందని అంటున్నారు. చూడాలి మరి ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్ నిజం అవుతుందా లేదా అనేది. సోమవారం రోజున ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరగబోతున్నాయని టాక్. సెన్సార్ పూర్తి అయ్యాక ఈ చిత్రం గురించి మరికొంత వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రం సక్సెస్ అయితే మరో రెండు భాగాలు తెరకెక్కిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. మూవీ టీం కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు.