SSMB29: మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రతీరోజు ఎదో ఒక వార్త లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతున్నాయి. వేల సంఖ్యలో ట్వీట్స్, కామెంట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభానికి ముందు రాజమౌళి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాగేసుకున్నట్టు ఒక వీడియో ని అప్లోడ్ చేశాడు. ఎందుకంటే మహేష్ బాబు చిన్న గ్యాప్ దొరికితే కుటుంబం తో కలిసి విదేశీ టూర్స్ కి వెళ్తుంటాడు కాబట్టి, ఆయన నుండి ఆ పాస్ పోర్ట్ ని లాక్కొని దాచుకున్నట్టు అన్నమాట. చాలా ఫన్నీ గా అనిపించిన వీడియో పై ఎన్నో వేల మీమ్స్ వచ్చాయి.
Babu ❤️#SSMB29
— Thyview (@Thyview) April 5, 2025
Also Read: టెస్ట్ ఫుల్ మూవీ రివ్యూ
అయితే నేడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన మరో వీడియో ఇప్పుడు నెటిజెన్స్ ని కడుపుబ్బా నవ్వించేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి విమానాశ్రయంలో కనిపించాడు. అక్కడికి వచ్చిన మీడియా ని మహేష్ బాబు తన చేతిలో ఉన్న పాస్ పోర్ట్ ని నవ్వుతూ చూపించాడు. దీనిని చూసిన అభిమానులు, మహేష్ లోని కామెడీ టైమింగ్ ఇంకా తగ్గలేదు, చాలా సైలెంట్ గా వేయాల్సిన పంచ్ వేసాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా లో మీమ్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి. అయితే మహేష్ తన కూతురుతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడా?, లేకపోతే సినిమా షూటింగ్ కోసమే వెళ్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
Idhi Highlights Asala #SSMB29 pic.twitter.com/5l8yddMt80
— тσηʏ ⚡ (@Tony_Toxic69) April 5, 2025
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వస్తే రీసెంట్ గానే ఒడిశా లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనడానికి హైదరాబాద్ కి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులకు చెప్పుకొచ్చింది. రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి, పృథ్వీ రాజ్ త్వరలోనే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలన్నీ చెప్పబోతున్నారు. ఈ నెలాఖరున ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
#MaheshBabu #SSMB29 pic.twitter.com/yn4niTKfMw
— Movies4u Official (@Movies4u_Officl) April 5, 2025
Passport is back to @urstrulyMahesh hand #SSMB29 #MaheshBabu pic.twitter.com/Jp5dvepga9
— KonaseemaSSMBFC (@KonaseemaSSMBFC) April 5, 2025
Happy Journey anna pic.twitter.com/XEYeC8E9V8
— ETV Win (@etvwin) April 5, 2025