Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Show Controversy: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షోలో నటరాజ్...

Mad For Each Other Show Controversy: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో నటరాజ్ మాస్టర్ కాళ్ళు పట్టుకునేంత పని చేసిన జడ్జీలు..

Mad For Each Other Show Controversy: స్టార్ మా ఛానల్ లో నెల రోజుల క్రితం మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో మొదట్లో బాగా అనిపించలేదు కానీ, ఆ తర్వాత మాత్రం ఆసక్తికరంగా సాగుతూ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్ నుండి హరిత – హరీష్, మహేష్ – సాండ్రా ఎలిమినేట్ అయ్యారు. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ప్రక్రియ ప్రకారం అయితే నటరాజ్ మాస్టర్ – నీతూ జంట ఎలిమినేట్ అవ్వాలి. కానీ టీం మాత్రం అలా చెయ్యలేదు. నేడు ఏకంగా ‘నో ఎలిమినేషన్’ పెట్టేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ షో పై తీవ్రమైన విమర్శలు అవచ్చేలా చేస్తోంది. రియాలిటీ షో అని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తుంటే స్క్రిప్ట్ షో లాగా అనిపిస్తోంది అంటూ ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.

హరిత – హరీష్ నోరు జారీ కొన్ని మాటలు అన్నందుకు ఆయన్ని జడ్జీలు ఒక రేంజ్ లో తిట్టారు , క్లాస్ పీకారు. దీనికి ఫీల్ అయిన ఆ జంట ప్రక్రియ ప్రకారం కాకుండా, స్వచ్చందంగా షో నుండి తప్పుకున్నారు. అప్పుడు జడ్జీలు, అలా కాదు , ప్రక్రియ ప్రకారమే వెళ్ళాలి, కచ్చితంగా మీరు ఫైనల్ బాటిల్ ఆడాల్సిందే అని ఎలాంటి ఒత్తిడి చెయ్యలేదు. పైగా ఆ జంటకు బాండ్ క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు. హరీష్ నోటి దూలకు ఆ మాత్రం జరగాల్సిందే అని అంతా అనుకున్నారు. కానీ నటరాజ్ మాస్టర్ అంతకు మించి నోరు జారాడు. జడ్జీలు కావాలని మాకు అన్యాయం చేస్తున్నారు , స్క్రిప్ట్ ప్రకారం మమ్మల్ని తొక్కేస్తూ , సీరియల్ వాళ్ళని పైకి లేపుతున్నారు , వీకెండ్ ఎపిసోడ్ లో వాళ్ళు నన్ను అవమానిస్తే , నాలోని అగ్నిపర్వతం బద్దలు అవుతుంది అంటూ ఎన్నో రకాల కామెంట్స్ చేశారు. షో రూల్స్ ప్రకారం ఇది చాలా తప్పు.

ఆయన చేసిన తప్పుకు జడ్జీలు హరిత – హరీష్ జంటకు ఎలా అయితే బాండ్ క్రెడిట్స్ ఇవ్వలేదో , వీళ్లకు కూడా ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ అలా చెయ్యలేదు , బాండ్ క్రెడిట్స్ ఇవ్వడమే కాకుండా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని షో లో బలవంతంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇది ఎంత వరకు న్యాయం చెప్పండి అని అంటున్నారు విశ్లేషకులు. మేము ప్రక్రియ ప్రకారం ఫైనల్ బాటిల్ ఆడలేము, మమ్మల్ని ఎలిమినేట్ చెయ్యండి అని స్వయంగా నటరాజ్ మాస్టర్ రిక్వెస్ట్ చేసినప్పటికీ, లేదు మీరు ఫైనల్ బాటిల్ ఆడాల్సిందే అని ఆయన చేత ఆడించారు. ఆ ఆటలో ఆయన ఓడిపోయాడు , ఎలిమినేట్ అవ్వాలి , కానీ జడ్జీలు ట్విస్టు ఇస్తూ, ఎలిమినేషన్ లేదని ప్రకటించారు. ఇలా మహేష్ – సాండ్రా కి ఎందుకు చెయ్యలేదు, హరిత – హరీష్ కి ఎందుకు చెయ్యలేదు , జనాల అభిరుచికి తగ్గట్టు షో ని నడపాలి కానీ, మీ ఇష్టమొచ్చినట్టు షో ని నడిపితే చివరికి ఫ్లాప్ ఫలితమే మిగులుతుంది అని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular